తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య కృష్ణా నీటి విషయమై వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వివాదం విషయాన్ని ఇద్దరు ముఖ్యమంత్రులు ఎటూ తేల్చట్లేదని, రెండు నిమిషాలు మాట్లాడుకుంటే పరిష్కారం దొరుకుతుందని, కానీ కావాలనే ఇంత రచ్చ చేస్తున్నారని ప్రతిపక్షాల నుండి విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా ఇదే విషయాన్ని గుర్తు చేసారు. కృష్ణా జలాలపై తెలంగాణ అడ్డంగ మాట్లాడుతుంతే సీఎం జగన్ మీనమేషాలు లెక్కిస్తూ కూర్చున్నారని కామెంట్లు చేసారు.
జలాల విషయంలో సీఎం జగన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో రాజీ పడడం సరికాదని, పులిబిడ్డ, పిలివెందుల బిడ్డ అని చెప్పుకోవడం కాదని, చేతల్లో సత్తా చూపాలని ఎద్దేవా చేసారు. ఇంకా, హుజురాబాద్ ఉపఎన్నికల కోసమే జలవివాదాన్ని తెరపైకి తీసుకువచ్చారని అన్నారు. మొత్తానికి జలవివాదం విషయంలో జగన్ వైఖరిపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు విరుచుకుపడ్డారనే చెప్పాలి.