ఈ జాగ్రత్తలు తీసుకుంటే వానాకాలంలో పిల్లలకి ఇబ్బందులు వుండవు..!

-

వానా కాలంలో అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. ముఖ్యంగా చిన్న పిల్లలకి వానా కాలంలో అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. పిల్లలు ఎక్కువగా బయట ఆడుకోవడానికి ఇష్టపడుతుంటారు. ఇటువంటి సమయంలో దోమలు ద్వారా నీళ్ల ద్వారా కూడా జబ్బులు వచ్చే అవకాశం ఉంది. ఏది ఏమైనా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మంచి పోషకాహారం ఇవ్వడం, హైజీన్ ని పాటించడం లాంటివి చేస్తూ ఉండాలి.

వానా కాలంలో వివిధ రకాల జబ్బులు వస్తాయి. దోమల ద్వారా డెంగ్యూ, మలేరియా, చికెన్ గునియా లాంటివి తీవ్రంగా వ్యాపిస్తాయి. దీనితో జ్వరం, కడుపునొప్పి ఇలా ఎన్నో సమస్యలు వస్తాయి. అలాగే ఆహారం ద్వారా నీళ్ల ద్వారా టైఫాయిడ్, హెపటిటీస్ మొదలైన సమస్యలు వస్తాయి. అలానే ఫంగల్ ఇన్ఫెక్షన్స్, జలుబు, ఫ్లూ, ఒళ్ళు నొప్పులు, ఆస్తమా వంటి సమస్యలు కూడా వస్తాయి.

వానాకాలంలో అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే ఇలా చేయండి:

పిల్లలకి వానా కాలంలో ఇబ్బందులు రాకుండా ఉండాలంటే పాలు, గుడ్లు, నట్స్ వంటివి ఇవ్వండి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
అలానే పండ్లు, కూరగాయలు కూడా ఎక్కువగా పెడుతూ ఉండండి.
బయట ఆహారానికి దూరంగా ఉంచి కేవలం మీ ఇంట్లో వండిన ఆహారాన్ని మాత్రమే ఇవ్వండి. అలానే పిల్లలు తినేటప్పుడు చేతుల్ని శుభ్రంగా కడగడం.. వాష్ రూమ్ కి వెళ్లి వచ్చాక చేతులు శుభ్రంగా కడగడం చేయండి.
ఫంగల్ ఇన్ఫెక్షన్ బారిన పడకుండా ఉండాలంటే సాక్సులు వంటి వేయండి.
దుస్తులు కూడా పొడవాటి స్లీవ్స్ ఉండే వాటిని ప్రిఫర్ చేయండి.
వానా కాలంలో పూలకుండీలు నీళ్లు ఎక్కువగా చేరిపోతూ ఉంటాయి. దీని వల్ల దోమలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news