వరుణ్ తేజ్ ‘వాల్మీకి’ అయ్యాడు

-

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన సినిమాల సెలక్షన్స్ తో ఆడియెన్స్ కు షాక్ ఇస్తున్నాడు. అంతరిక్షం, ఎఫ్-2 సినిమాలనే చూస్తే ఒకటి ప్రయోగం మరోటి ఎంటర్టైనర్.. ఇలా హిట్టు ఫ్లాపులను సమపాళ్లలో బేరీజు వేసుకుంటూ వరుణ్ తేజ్ కెరియర్ లో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నాడు. ఎఫ్-2 హిట్ జోష్ లో ఉన్న ఈ మెగా హీరో ఏమాత్రం లేటు చేయకుండా తన తర్వాత సినిమా మొదలుపెట్టాడు. కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ జిగుర్తండా రీమేక్ లో నటిస్తున్నాడు వరుణ్ తేజ్.

ఇక్కడ విశేషం ఏంటంటే ఆ సినిమాలో వరుణ్ తేజ్ బాబి సింహా నటించిన నెగటివ్ రోల్ లో నటిస్తున్నాడు. హరీష్ శంకర్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా ఈరోజు ముహుర్త కార్యక్రమాలు జరుపుకున్నారు. ఇక షూటింగ్ మొదలు పెట్టిన రోజే సినిమా టైటిల్ కార్డ్ వేయడం హరీష్ శంకర్ కు అలవాటే.. అలానే ఈ సినిమాకు కూడా వాల్మీకి అనే టైటిల్ ఫిక్స్ చేశారు. డైరక్టర్ కావాలనుకునే ఓ వ్యక్తి.. డాన్ కు మధ్య జరిగే కథే ఈ వాల్మీకి.

టైటిల్ పోస్టర్ లో హరీష్ శంకర్ తన స్టైల్ చూపించాడు. మెగా హీరోలకు హరీష్ ఇప్పటికి వరకు సూపర్ హిట్లే ఇచ్చాడు. మరి వాల్మీకి కూడా అదే హిట్ మేనియా కొనసాగిస్తుందో లేదో చూడాలి. 14 రీల్స్ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమాను రాం ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్నారు. సినిమకు సంబందించిన మిగతా కాస్ట్ అండ్ క్రూ ఎవరన్నది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news