తాజాగా ఏపీ రాజకీయవర్గాల్లో ఆసక్తికర గాసిప్ ఒకటి చక్కెర్లు కొడుతుంది! అది ఏమిటయ్యా అంటే… చంద్రబాబు కానీ, బాలయ్య బాబు కానీ… ఎవరో ఒకరు చినబాబు కోసం త్యాగం చేయాలంట! ఫలితంగా చినబాబు కాస్తైనా సేఫ్ జోన్ లోకి వెళ్తారనంట!
ఏపీ టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు.. చినబాబు లోకేష్ రాజకీయ పరిజ్ఞానం గురించి, సామర్ధ్యం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు! మంత్రిగా పనిచేసినా కూడా ఎమ్మెల్యేగా గెలవలేని పరిస్థితి ఆయనది! తాను పోటీచేసిన నియోజకవర్గం పేరును సైతం సరిగ్గా పలకలేని వాక్ చాతుర్యం ఆయన సొంతం! చినబాబును విమర్శించే ప్రతిసారీ వైకాపా నాయకులు ఎత్తుకునే అంశాలివి! దీంతో… ఇకపై ఈ విషయంలో ఒక సీరియస్ నిర్ణయానికి వచ్చారంట చినబాబు!
ఇకపై వేరే నియోజకవర్గాల్లో పోటీచేసి రిస్క్ చేయడం మంచిది కాదని.. అందులో భాగంగా తన తండ్రికి అచ్చొచ్చిన కుప్పం నియోజకవర్గం నుంచి కానీ, మామ బాలయ్యబాబు నియోజకవర్గం అయిన హిందూపుర్ నుంచి కానీ పోటీచేయాలని భావిస్తున్నారంట! నియోజకవర్గాల పేర్లు పలకడమూ సులువుగా ఉంటుంది.. పాజిటివ్ ఫలితాలు సాధించడానికి కూడా కాస్త అనుకూలంగా ఉంటుందనో ఏమో కానీ.. ఆ రెండింటిలో ఏదో ఒకటి తనకు కావాలని ఫిక్సయ్యారంట!
అయితే… ఈ విషయంలో హిందూపూర్ కంటే కూడా కుప్పంపైనే చినబాబు ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారని తెలుస్తుంది. మరి చంద్రబాబు సంగతేందయ్యా? అని అంటే… ఇకపై నాన్నగారికి విశ్రాంతిని ఇచ్చి, తానే స్వయంగా రంగంలోకి దిగబోతున్నట్లు చెబుతున్నారంట చినబాబు. చంద్రబాబు కూడా ప్రత్యక్ష రాజకీయాలకు రెస్ట్ ఇచ్చి.. వెనక ఉండి చినబాబుని మెయిన్ హీరో చేస్తారంట!
కాగా.. వచ్చే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబుని ఓడించాలని వైకాపా కలలుగంటున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా… ఇప్పటికే కుప్పంలోని టీడీపీ ద్వితీయశ్రేణి నాయకులను గ్రిప్పులోకి తెచ్చుకుంది వైకాపా. మరి నారావారి కంచుకోట కుప్పంలో కూడా వైకాపా జెండా పాతడం, పాతకపోవడం ఇకపై చినబాబు చేతుల్లో ఉంటుందన్న మాట!
-CH Raja