ఏపీలో సమైక్యాంధ్ర తరహా ఉద్యమం… రిజల్ట్ సేం?

-

ఎప్పుడో రాష్ట్ర విభజన సమయంలో దాదపు ఏపీలో అన్ని పార్టీలూ ఒకేమాటపై నిలబడినట్లుగా ప్రవర్తించాయి. సమైక్యాంధ్ర కు అనుకూలంగా నినాదాలు చేశాయి! ఫలితంలో మార్పు తీసుకొచ్చేటంత పోరాటాలు అయితే చేయలేదు కానీ… ఆ ఉద్యమం మాటున రాజకీయ మనుగడను వెతుకున్నాయి! ఫలితంగా ఏపీ వాసులకు ఎంత అన్యాయం చేయాలో అంతా చేశాయి! అయితే మరోసారి ఏపీలో అన్ని రాజకీయ పార్టీలూ ఒకేమాటపైకి వచ్చాయి!

ఈనెల 27 న భారత్‌ బంద్‌ నిర్వహించాలని జాతీయ రైతు సంఘాలు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్‌.. రైతు, కార్మిక, ఉద్యోగ, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ బంద్‌ కొనసాగనుంది! ఇందుకు దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలన్ని మద్దతు ప్రటిస్తున్నాయి. ఇందులో భాగంగా… ఈనెల 27న రైతు సంఘాలు చేపట్టిన భారత్ బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి తెలుగుదేశం పార్టీ – వైఎస్సార్ సీపీ!

అవును… వ్యవసాయ చట్టాలు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణలకు వ్యతిరేకంగా తలపెట్టిన భారత్‌ బంద్‌ విషయంలో కమ్యునిస్టులు – టీడీపీ – వైకాపా లు ఒకేతాటిపైకి వచ్చాయి. ఇందులో భాగంగా.. 26వ తేదీ అర్ధరాత్రి నుంచి 27వ తేదీ 1 గంట వరకు ఏపీలో ఆర్టీసీ బస్సులు నడవవు. ఈ సందర్భంగా స్పందించిన పేర్ని నాని… రైతు సంఘాలు శాంతియుతంగా బంద్‌ లో పాల్గొనాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.

అయితే… వ్యవసాయ చట్టాలు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో భారత్ బంద్‌ ఏపీకి అత్యంత కీలకమైన అంశం. ఆంధ్రుల హక్కుని కాపాడుకోవటానికి దొరికిన ఒక సువర్ణావకాశం! ఈ విషయంలో “తప్పదు కాబట్టి” అనే ఉద్దేశ్యంతో రంగంలోకి దిగకుండా… “తప్పకుండా సాధించాలి” అనే లక్ష్యంతో రంగంలోకి దిగాలి. ఈ భారత్ బంద్ ను ఆసరాగా చేసుకుని… విశాఖ ఉక్కుని కాపాడుకునే పోరాటాన్ని కంటిన్యూ చేయాలి. రాజకీయాలకు అతీతంగా శక్తులన్నీ కలవాలి.. మోడీ మెడలు వంచాలి.. ఆంధ్రుల హక్కుని కాపాడుకోవాలి!

అయితే… గతంలో జరిగిన సమైక్యాంధ్ర ఉద్యమంలో ఏపీ రాజకీయ నేతలు ఎంత ఐకమత్యంగా ఉన్నారనేది ప్రతీ ఏపీవాసీ చూశారు. దీంతో… ఇకనైనా కాస్త ఇంగితం తో వ్యవహరిస్తూ… కలిసి కట్టుగా పోటీచేయాలని… కోరుకుంటున్నారు ఆంధ్రులు! అలాకానిపక్షంలో.. ఈ ఒక్కరోజు సంబంరం రాజకీయ లబ్ధికి ఏమైనా ఉపయోగపడొచ్చని భావిస్తే మాత్రం… సమైక్యాంధ్ర ఉద్యమం లాగానే… విశాఖ ఉక్కు ఉద్యమం కూడా సేం రిజల్ట్ ఇచ్చే ప్రమాధం ఉంది!!

Read more RELATED
Recommended to you

Latest news