ఏపీలోని బద్వేలు ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. హుజురాబాద్ నియోజక వర్గ ఉప ఎన్నిక తో పాటు బద్వేలు ఉప ఎన్నికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం.అక్టోబర్ 30 న బద్వేలు ఉప ఎన్నిక పోలింగ్ జరుగనుండగా… అక్టోబర్ 1న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇక నవంబర్ 2వ తేదీ ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన కూడా చేయనున్నారు ఎన్నికల అధికారులు.
ఇది ఇలా ఉండగా… బద్వేలు వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా డాక్టర్ దాసరి సుధ బరిలో ఉండనుంది.. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య సతీమణియో ఈ డాక్టర్ దాసరి సుధ. కడపలో డాక్టర్ గా ప్రాక్టీస్ చేస్తున్నారు డాక్టర్ సుధ… ఈ ఏడాది మార్చ్ 28 న అనారోగ్యంతో కన్నుమూశారు ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య.
సుబ్బయ్య మరణంతో అతని సతీమణి సుధకు టికెట్ ఖరారు చేశారు సీఎం జగన్. ఇక ఇప్పటికే బద్వేలు నియోజకవర్గ పరిధిలో ఎన్నికల్లో అభ్యర్థిగా పరిచయ కార్యక్రమం నిర్వహిస్తున్నారు డాక్టర్ సుధ. స్థానిక ఎమ్మెల్సీ గోవింద రెడ్డితో కలిసి ఇంటింటి పరిచయ కార్యక్రమం కూడా ప్రారంభించేశారు. ఇక అటు టీడీపీ అధ్యర్థిగా డా. ఓబుళా పురం రాజశేఖర్ ను ఇప్పటికే ప్రకటించారు చంద్రబాబు. బీజేపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీలు ఇంకా తమ అభ్యర్థులను ప్రకటించలేదు.