ఆహారానికి అదనపు రుచి అందించే పదార్థాలు మీ ఆరోగ్యానికి హానికరం కావచ్చు..

-

ఈ మధ్యకాలంలో ప్యాకేజీ ఫుడ్స్ కి ఆదరణ పెరుగుతుంది. ఇంట్లో వండుకునే ఓపిక లేక చాలా త్వరగా తయారయ్యే ఆహారాలను తినడానికి ఇష్టపడుతున్నారు. అలాగే, ఆహారానికి అదనపు రుచి అందించే అనేక పదార్థాల వాడకం ఎక్కువవుతుంది. కానీ, మీకిది తెలుసా? ఆహారానికి అదనపు రుచిని అందించే పదార్థాలు మీ ఆరోగ్యానికి హానికరం. వాటిల్లోని హానికర రసాయనాలు క్యాన్సర్, డయాబెటిస్ వంటి వ్యాధులకు మూలకారణం అయ్యే అవకాశం ఉంది. అందువల్ల అలాంటి వాటిపట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.

 

హైడ్రోజినేటెడ్ కొవ్వులు

ఈ కొవ్వుల కారణంగా శరీరంలో చెడుకొవ్వు ఎక్కువవుతుంది. అంతేకాదు గుండెపోటు, క్యాన్సర్, ఊబకాయం, డయాబెటిస్ వంటి వాటికి దారి తీయవచ్చు. అందువల్ల వీటిపట్ల జాగ్రత్తగా ఉండాలి.

కృత్రిమ రంగులు

ఈ రంగుల వల్ల శరీరానికి హాని కలుగుతుంది. ఇందులో కార్సినోజెన్ కారకాలు ఉంటాయి. అవి క్యాన్సర్ కణాలను ఉత్పత్తి చేయడంలో తోడ్పడతాయి. అందుకే ఆహారం అందంగా కనిపించాలని అనవసర కృత్రిమ రంగులను వినియోగించవద్దు.

పొటాషియం బ్రోమేట్

మీరెప్పుడయినా బ్రెడ్ కొంటున్నట్లయితే అందులో పొటాషియం బ్రోమేట్ ఉండకుండా చూసుకోండి. అంతర్జాతీయ క్యాన్సర్ పరిశోధన సంస్థ ప్రకారం ఇందులో క్యాన్సర్ కు కారణమయ్యే కార్సినోజెన్ ఉంటుంది. అందుకే యూకే, కెనడా వంటి దేశాలు దీన్ని నిషేధించాయి.

కృత్రిమ తీపి కారకాలు

కృత్రిమ తీపి కారకాల్లో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. కానీ దీనివల్ల ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంది.

అందువల్ల ఇలాంటి అంశాల పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం చాలా ఉంది. అనవసర అదనపు హంగులను ఆహారానికి చేర్చకుండా ప్రకృతిలో దొరికిన సహజమైన వాటిని ఆరగించడం అన్నింటికన్నా అత్యుత్తమం.

Read more RELATED
Recommended to you

Latest news