కరోనా కట్టడికి అన్న దేశాల ప్రభుత్వాలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. ముఖ్యంగా వ్యాక్సిన్ కార్యక్రమాన్ని వేగవంతం చేశాయి. ఇండియాలో కూడా భారీ స్థాయిలో ప్రజలకు వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. దేశంతో దేశీయ తయారీ కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. తాజాగా మరో వ్యాక్సిన్ భారత్ లో త్వరలో అందుబాటులోకి రానుంది. జైడస్ కాడిలా ఫార్మా కంపెనీ తయారు చేసిన వ్యాక్సిన్ జైకోవ్ డీ పేరుతో అందుబాటులోకి రానుంది.
ప్రపంచంలో డీఎన్ఏ బేస్డ్ వ్యాక్సిన్ గా జైకోవ్ డీ తయారైంది. సూదీ లేకుండా జెట్ ఇంజక్టర్ల ద్వారా శరీరంలోకి మందును పంపించేలా నీడిల్ ఫ్రీగా జైకోవ్- డీ వ్యాక్సిన్ తయారైంది. మూడు డోసులుగా ఇచ్చే ఈ వ్యాక్సిన్ ధరను సంస్థ రూ. 1900 గా నిర్ధారించింది. కోవాగ్జిన్, కోవిషీల్డ్ కన్నా భిన్నమైన వ్యాక్సిన్ కాబట్టే ఈధర అని సదరు సంస్థ చెబుతోంది. అయితే కేంద్రం ధర తగ్గింపుపై సదరు సంస్థతో చర్చలు జరుపుతోంది. ఈవ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే 12 ఏళ్లపై బడిన వారందరికి వ్యాక్సిన్ అందుతుంది. ప్రస్తుతం 18 ఏళ్లకు పైబడిన వారందరికి కరోనా వ్యాక్సిన్ అందిస్తున్నారు. జైకోవ్- డీ వ్యాక్సిన్ మూడు డోసులుగా మొదటిరోజు , 28 వరోజు, 56 వరోజు ఇవ్వనున్నారు.