విశాఖ ఉక్కు -ఆంధ్రుల హక్కు.. కార్మికుల కోసం నిలబడాల్సిందే : పవన్ కళ్యాణ్

-

విశాఖ ఉక్కు -ఆంధ్రుల హక్కు.. ఏపీ లోని అని పార్టీల నేతలు కార్మికుల కోసం నిలబడాల్సిందేనని జన సేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. కాసేపటి క్రితమే విశాఖలో జనసేన పార్టీ నిర్వహించిన బహిరంగ సభ కు పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. ఈ సందర్భంగా స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న కార్మికులకు సంఘీభావం తెలిపారు పవన్ కళ్యాణ్.

pawan kalyan
pawan kalyan

అనంతరం ఆయన మాట్లాడుతూ… ఉక్కు కర్మాగారం లేకుంటే దేశం ముందుకు వెళ్ళదని… విశాఖ ఉక్కు -ఆంధ్రుల హక్కు అని చదువుకున్నామని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్. కులాల కుంపట్లు, వర్గాల పోరులో నిండిపోయిన ప్రభుత్వంలో ఉక్కు ఉద్యమం ఊపు తెచ్చిందని గుర్తు చేశారు.

విశాఖ ఉద్యమం ఎలా జరిగిందో ఈ తరానికి చెప్పాలని.. ఎన్నో ఉద్యమాలు జరిగాయన్నారు పవన్ కళ్యాణ్. స్టీల్ ప్లాంట్ రావడానికి ఎంతో మంది త్యాగాలు చేశారని…స్టీల్ ప్లాంట్ కోసం ఏకంగా 37 మంది కార్మికులు మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉక్కు సంకల్పంతో ఈ సంస్థను కాపాడుకోవాలని… సమస్యలు వచ్చినప్పుడు ఎవరూ నిలబడరన్నారు. సైనికులు నిలబడతారని..  వీర మహిళలు నిలబడతారని పేర్కొన్నారు. మనం మన ఉక్కు పరిశ్రమను కాపాడుకుందామని.. అన్ని సంస్థకు స్వంత గనులు వున్నాయన్నారు పవన్ కళ్యాణ్.

Read more RELATED
Recommended to you

Latest news