హైదరాబాద్ లో మహేశ్ బాబు మైనపు బొమ్మ

-

Mahesh babu wax statue to unveil in Hyderabad

మహేశ్ బాబు.. సినిమా సూపర్ స్టార్. అంతేనా కాదు.. అంతకు మించి. సమాజ సేవలోనూ మహేశ్ ఎప్పుడూ ముందుంటారు. అందుకే ఆయన రియల్ సూపర్ స్టార్. సినీ రంగానికి, సమాజానికి ఆయన చేసిన సేవకు గౌరవంగా మహేశ్ బాబు మైనపు బొమ్మను హైదరాబాద్ లో ఆవిష్కరించనున్నారు.

సింగపూర్ లోని ప్రఖ్యాత మేడం టుస్సాడ్స్ వారు మహేశ్ బాబు మైనపు బొమ్మను ఆవిష్కరించనున్నారు. సాధారణంగా మేడం టుస్సాడ్స్ సెలబ్రిటీల మైనపు బొమ్మను సింగపూర్ లోనే ఆవిష్కరిస్తారు. కానీ.. మొదటి సారి.. మహేశ్ మైనపు బొమ్మను సింగపూర్ లో కాకుండా వేరే ప్రాంతంలో ఆవిష్కరించనున్నారు.

mahesh babu wax statue to unveil in hyderabad

తర్వాత మహేశ్ మైనపు బొమ్మను సింగపూర్ లో జరిగే ఐఫా ఉత్సవాల్లో ప్రదర్శించనున్నారు. మహేశ్ మైనపు బొమ్మ కోసం తయారీ కోసం మేడం టుస్సాడ్స్ నిపుణుల బృందం ఇప్పటికే హైదరాబాద్ వచ్చి మహేశ్ బాబు కొలతలను సేకరించారు. మార్చి 25న మహేశ్ మైనపు బొమ్మను హైదరాబాద్ లోని ఏఎంబీ మల్టీప్లెక్స్ లో ఆవిష్కరించనున్నారు. ఒకరోజు ప్రదర్శన అనంతరం దాన్ని సింగపూర్ తరలించనున్నారు.

తెలుగు సెలబ్రిటీల్లో ఇప్పటికే మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో ప్రభాస్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రభాస్ తర్వాత ఆ అదృష్టం దక్కిన వ్యక్తి మహేశ్ బాబే. కాకపోతే.. మహేశ్ బాబు మైనపు విగ్రహాన్ని హైదరాబాద్ లో ఆవిష్కరించిన అనంతరం మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో పెట్టనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news