హుజూరాబాద్ గెలుపు నుంచి డైవర్ట్ చేసేందుకే… కేసీఆర్ వరిధాన్యం కొనుగోలు డ్రామా- కిషన్ రెడ్డి

-

హుజూరాబాద్ లో గెలుపు నుంచి ప్రజల చూపును మళ్లించేందుకే కేసీఆర్ వరి ధాన్యం కొనుగోలు పల్లవిని ఎత్తుకున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ కుటుంబా పాలన, అవినీతి పాలన, ప్రజాస్వామ్య వ్యతిరేఖ పాలనకు నిదర్శనమే హుజూరాబాద్ తీర్పు అని కిషన్ రెడ్డి అన్నారు. హుజూరాబాద్ ఎన్నికలు సాధారణమైనవి కావని… దీని కోసం కేసీఆర్ ప్లీనరీ పెట్టాడని.. విజయ గర్జన సభ పెట్టాడని.. ఇలాంటి ఎన్నికలను నేను ఎప్పుడూ చూడలేదని  కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో అభివ్రుద్ది పనులు ఆపేసి మరీ హుజూరాబాద్ లో పనులు చేశారని… మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రగతి భవన్ నుంచి  చేశారని అయిన అన్నారు. ప్రజల్ని ఎంత అణచి వేస్తే అంతగా తిరగబడుతారని కిషన్ రెడ్డి అన్నారు.

తెలంగాణ ఏర్పాటు అయిన కొత్తలో ధాన్యం కొనుగోలుకు రూ. 3600 కోట్లు ఖర్చు చేస్తే.. ఏడేళ్ల తరువాత రూ. 26600  కోట్ల ఖర్చు చేసి మరీ కేంద్రం ధాన్యాన్ని కొంటుందని వెల్లడించారు. ఓసారి వరి వేయమని.. ఓసారి వద్దని రైతుల్ని గందరగోళ పరుస్తున్నది కేసీఆరే అని.. బీజేపీ ఎప్పుడూ రైతులను ఈ పంటే వేయాలని ఆదేశించలేదని గుర్తు చేశారు. ’రా‘ రైస్ కొనమని కేంద్రం ఎప్పుడూ చెప్పలేదని అన్నారు. అయినా కూడా రైతుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని ప్రశ్నించారు. కొడుకును ముఖ్యమంత్రి చేయడానికే కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి బయటలకు వచ్చాడు తప్పితే.. రైతులపై ప్రేమతో కాదని ఎద్దేవా చేశాడు కిషన్ రెడ్డి.

 

Read more RELATED
Recommended to you

Latest news