కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వల్ల హాస్పిటల్లో చేరుతున్న వారి సంఖ్య చాలా తక్కువగా ఉన్నదని, కానీ, అత్యంత వేగంగా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుండటంతో అత్యంత తీవ్రమైన వేరియంట్‌గా పరిగణించాల్సి ఉన్నదని సౌతాఫ్రికా వైద్యాధికారులు భారత్‌లో మెడికల్ ఎక్స్ఫర్ట్స్కు వివరించారు. స్వల్ప లక్షణాలు కలిగిన వారు సైతం తీవ్రమైన అలసటకు గురవుతున్నారని వివరించినట్లు తెలిసింది.
కొత్త వెలుగులోకి వచ్చిన వేరియంట్‌ను ‘వేరీ రిస్క్’గా పేర్కొన్న వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(డబ్ల్యూహెచ్ఓ) ఒమైక్రాన్ ద్వారా ప్రపంచానికి ప్రమాదం అని పేర్కొన్న నేపథ్యంలో తాజా అప్డేట్ కొంత ఉపశమనం కలిగించేలా ఉన్నది. ఒమైక్రాన్ వేరియంట్‌ను ఎదుర్కోనేందుకు ఆఫ్రికా దేశాలకు పూర్తి సహాయసహకారాలు అందించనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. భారత దేశంలో తయారైన వ్యాక్సిన్లను అందజేస్తామని హామీ ఇచ్చింది.