జగన్ సర్కార్ కు బిగ్ రిలీఫ్..పేదల ఇళ్ల నిర్మాణాలపై హైకోర్టు సంచలన నిర్ణయం !

-

పేదలందరికీ ఇళ్ళు పథకం పై ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర హై కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. పేదలందరికీ ఇళ్ళు పథకం పై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును తాజాగా రద్దు చేస్తూ హై కోర్టు డివిజన్ బెంచ్ తీర్పు ను వెలువరించింది. హై కోర్టు డివిజన్ బెంచ్ తీర్పు తో ఇళ్ల స్థలాల పై హై కోర్టు లో దాఖలు చేసిన పిటిషన్ ను వెనక్కి తీసుకున్నారు పిటిషనర్లు.

గత నెల 8 వ తేదీన పేదలందరికీ స్థలాలు పథకం లో భాగంగా జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం కేటాయించిన స్థలాల్లో ఎటువంటి నిర్మాణాలు చేయొద్దని తీర్పు ఇచ్చింది ఏపీ హై కోర్టు సింగిల్ బెంచ్. అయితే…. ఈ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు ను సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ ఆశ్రయించింది జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం. అయితే… దీనిపై ఇవాళ విచారణ చేపట్టింది హై కోర్టు డివిజన్ బెంచ్. ఈ నేపథ్యంలోనే… జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో ఏపీలో పేదల ఇళ్ల నిర్మాణానికి మార్గం సుగమం అయింది.

Read more RELATED
Recommended to you

Latest news