కళాశాలల్లో కరోనా కలకలం… ఒడిశాలో 33 మంది విద్యార్థులకు కరోనా..

-

నెమ్మదిగా మరోసారి కరోనా కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా కళాశాలలు, పాఠశాలల్లో విద్యార్ధులు కరోనా బారి పడుతున్నారు. ఇటీవల కర్ణాటక ధార్వాడ్ మెడికల్ కాలేజీ ఘటన మరవక ముందే ఒడిశాలోని ఓ రెసిడెన్షియల్ కాలేజీలో విద్యార్ఢులు కరోనా బారిన పడ్డారు. తాజాగా..ఒడిశాలోని దెంకనల్​లోని కుంజకంట ప్రాంతంలో ఉన్న రెసిడెన్షియల్​ కాలేజీలో 33మంది బాలికలకు కొవిడ్​ సోకినట్టు తేలింది. మొదట కాలేజీలోని నలుగురికి కరోనా సోకింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది.. మిగిలిన వారికి పరీక్షలు నిర్వహించారు. ఇందులోనే కొవిడ్​ కేసులు బయటపడ్డాయి. కరోనా విజృంభణ నేపథ్యంలో కాలేజీని పూర్తిగా మూసివేశారు. కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు రంగంలోకి దిగిన అధికారులు.. కాలేజీని పూర్తిగా శానిటైజ్​ చేశారు.

corona

ఇటీవల కర్ణాటకలోని ధార్వాడ్ లో ఎస్డీఎమ్ వైద్య కళాశాలలో కోవిడ్ కలకలం కలిగించింది. ప్రెషర్స్ పార్టీలో విద్యార్థుల పాల్గొనడం .. ఆ తరువాత పదుల సంఖ్యలో విద్యార్దులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఆ కళాశాలలో మొత్తం 281 మంది వైద్య విద్యార్ధులు కరోనా బారిన పడ్డారు. అధికారులు విద్యార్థులందరిని క్వారంటైన్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. వ్యాక్సిన్ వేసుకున్నా కూడా.. కరోనా మళ్లీ సోకడం కలకలం రేపింది.

Read more RELATED
Recommended to you

Latest news