బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన అఖండ సినిమాపై భారీ ఎక్స్పెక్టేషన్స్ ముందు నుండి కూడా ఎక్కువగా వున్నాయి. బోయపాటి శ్రీను, బాలకృష్ణ అంటే బాక్సాఫీస్ దగ్గర రికార్డులు బద్దలు అవ్వాల్సిందే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పైగా సింహా, లెజెండ్ వంటి సినిమాలు చూస్తే ఈ కాంబినేషన్ లో సినిమాలు వస్తే విధ్వంసమే అని తెలుస్తోంది. అయితే మరి ఈ సినిమా ఎలా ఉంది.
అఖండ నటీనటులు: బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్, జగపతిబాబు, శ్రీకాంత్, పూర్ణ, సుబ్బరాజు, అవినాష్, సాయికుమార్, శ్రవణ్, ప్రభాకర్, తదితరులు.
సంగీతం: తమన్
ఛాయాగ్రహణం: సి.రాంప్రసాద్
కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, తమ్మిరాజు
కళ: ఎ.ఎస్.ప్రకాశ్
మాటలు: ఎమ్.రత్నం
ఫైట్స్ : స్టంట్ శివ, రామ్, లక్ష్మణ్
నిర్మాత: మిర్యాల రవీందర్‌రెడ్డి
దర్శకత్వం: బోయపాటి శ్రీను
అఖండ కధ:
ఎంతో మంది ప్రజలు ఫ్యాక్షనిజంని ఫాలో అవుతుంటే వాళ్ళని దారి మళ్ళించి మార్చాలని శ్రీకారం చుడతాడు హీరో బాలకృష్ణ (మురళీ కృష్ణ). చుట్టుపక్కల ఊళ్ళల్లో పాఠశాలలని, ఆసుపత్రిని కట్టించి ప్రజలకు సేవ చేస్తాడు. ఈ పనులన్నీ చూసి కొత్తగా వచ్చిన కలెక్టర్ శరణ్య మురళీకృష్ణ పై ప్రేమలో పడుతుంది. ఆ ప్రాంతంలో వరదరాజులు (శ్రీకాంత్) మైనింగ్ మాఫియాని నడుపుతాడు.
యురేనియం తవ్వకాలతో చిన్నారుల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుంది. అయితే ఈ మైనింగ్ మాఫియా వాళ్ల అంతు చూడాలని అనుకుంటాడు బాలకృష్ణ. ఈ క్రమంలో ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి. వరదరాజులు వెనుక ఒక మాఫియా లీడర్ వుంటాడు. అలానే బాలకృష్ణ చిన్నప్పుడే ఇంట్లో నుండి వెళ్ళి పోతాడు. తాను తన కుటుంబం నుండి విడిపోవడానికి కారణం ఏమిటి..? మురళీకృష్ణ కుటుంబానికి శివుడు ఎలా సాయం చేశాడు ఇటువంటివన్నీ ఉంటాయి.
సినిమా ఎలా ఉంది..?
ఇక సినిమా ఎలా వుంది అనేది చూస్తే మురళీకృష్ణ పాత్రలో బాలకృష్ణ ఎంతో అద్భుతంగా నటించాడు. కోపం నటన ఇవన్నీ కూడా ఎంతో అద్భుతంగా ఉన్నాయి. హీరో ఇంట్రడక్షన్ మొదలుకొని చాలా సన్నివేశాలు బోయపాటి అద్భుతంగా తీశారు. ప్రకృతి గురించి ఆయన చెప్పే సంభాషణలు బాగుంటాయి. జై బాలయ్య పాట కూడా బాగా మెప్పించింది. ప్రగ్య, బాలక్రిష్ణ జోడి కూడా చాలా అద్భుతంగా ఉంది. బాలకృష్ణ చేస్తున్న రెండో పాత్రని అఘోరాగా చూపించడం ఈ చిత్రానికి ప్లస్ అయ్యిందని చెప్పొచ్చు .కథ కంటే కూడా పాత్రలను మలిచిన తీరు చాలా అద్భుతంగా ఉంది. దేవాలయాలు, దేవుడు ప్రకృతి తదితర అంశాలు బాగా ఉన్నాయి.
ప్లస్లు:
బాలకృష్ణ నటన
ఫైటింగ్ సీన్స్
మ్యూజిక్
మైనస్లు:
కొన్ని ఫైటింగ్ సీన్స్ నెమ్మదిగా కదలడం
ఓవరాల్ గా చూస్తే సినిమా బాగుంది. మాస్ ఫ్యాన్స్ కి ఇక పండగనే అనాలి. అన్ని ఎమోషన్స్ కూడా చాలా బాగున్నాయి. డైరెక్షన్, సినిమాటోగ్రఫీ బాగుంది.
Rating: 3/5