మమతా దూకుడు..కేసీఆర్-జగన్ చేయి కలుపుతారా?

-

దేశ రాజకీయాలు కీలక మలుపు తిరిగినట్లు కనిపిస్తోంది. ఇప్పటివరకు బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్యే ప్రధాన పోరు ఉండేది. అయితే మధ్యలో చాలామంది మూడో ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయడానికి చూశారు గానీ…అది పెద్దగా వర్కౌట్ కాలేదు. ఆఖరికి తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం ఫెడరల్ ఫ్రంట్ అంటూ హడావిడి చేశారు గానీ…ఉపయోగం లేకుండా పోయింది. బలంగా ఉన్న బీజేపీని ఏ మాత్రం ఇబ్బంది పెట్టలేకపోయారు.

kcr-jagan
kcr-jagan

అయితే ఇప్పటికీ కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే స్ట్రాంగ్‌గా ఉన్న మాట నిజం. అలాగే కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ పెద్దగా ప్రభావం చూపలేకపోతుంది. ఈ క్రమంలోనే పశ్చిమ బెంగాల్‌లో బీజేపీని మట్టికరిపించి మూడోసారి అధికార పీఠాన్ని కైవసం చేసుకున్న మమతా బెనర్జీ ఇప్పుడు..దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడానికి సిద్ధమవుతున్నారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంతి కిషోర్ సపోర్ట్‌తో ఆమె చక్రం తిప్పడం మొదలుపెట్టారు. బీజేపీని గద్దె దించడానికి ప్రయత్నాలు స్టార్ట్ చేశారు. ఇదే క్రమంలో ఆమె కాంగ్రెస్‌ని కూడా పక్కనబెట్టేశారు. కాంగ్రెస్ సత్తా అయిపోయిందని అంటున్నారు.

ఇక ఈ రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఆమె ముందుకెళుతున్నారు. దేశంలో ప్రాంతీయ పార్టీలని ఏకం చేసే పనిలో పడ్డారు. ఇప్పటికే తన పార్టీ తృణమూల్ కాంగ్రెస్‌ని ఇతర రాష్ట్రాల్లో కూడా విస్తరించే పనిలో ఉన్న ఆమె..ఆయా రాష్ట్రాల్లో బలంగా ఉన్న పార్టీలని దగ్గర చేసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇప్పటికే ఆప్, ఎన్‌సి‌పి, డి‌ఎం‌కే, శివసేన, ఎస్పీ, బీఎస్పీ లాంటి పార్టీలని ఏకతాటిపైకి తీసుకోచ్చేందుకు చూస్తున్నారు. ఇటు తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే…పరిస్తితులని బట్టి కేసీఆర్, జగన్‌లని సైతం కలుపుకోవడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

అయితే తెలుగు రాష్ట్రాల సీఎంలు కలుస్తారా? లేదా? అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న..కేసీఆర్ ఎలాగో బీజేపీపై ఆగ్రహంతో ఉన్నారు. అటు కాంగ్రెస్ కూడా ఆయనకు ప్రత్యర్ధే. కానీ జగన్ విషయంలో స్పష్టత లేదు. మరి మమతాతో ఈ ఇద్దరు సీఎంలు కలుస్తారో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news