బ్రేకింగ్ ..మాజీ కొణిజేటి ముఖ్య‌మంత్రి రోశ‌య్య మృతి

-

మాజీ ముఖ్య‌మంత్రి, కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కులు రోశ‌య్య మ‌ర‌ణించారు. తీవ్ర అనారోగ్యానికి గురైన మాజీ ముఖ్య మంత్రి రోశయ్య ఇవాళ ఉద‌యం మ‌ర‌ణించారు. 88 సంవ‌త్స‌రాలు ఉన్న మాజీ ముఖ్య‌మంత్రి రోశ‌య్య‌… ఆరోగ్యం విష‌మించి… తుదిశ్వాస విడిచారు. ఇవాళ ఉద‌యం ఒక్క సారి గా బీపీ డౌన్ కావడం తో రోశ‌య్య‌ను ఆస్పత్రికి తరలించారు. హైద‌రాబాద్ లోని స్టార్ ఆస్పత్రికి రోశ‌య్య‌ను తరలించారు కుటుంబ సభ్యులు. అయితే…. ఆస్పత్రికి వెళ్లగానే రోశయ్య చనిపోయినట్లుగా నిర్ధారించారు వైద్యులు.

ఇంటి దగ్గర నుంచి ఆస్పత్రి కి మార్గమధ్యంలోనే రోశయ్య మృతి చెందార‌ని తెలుస్తోంది. దీంతో రోశయ్య పార్థివ దేహాన్ని ఇంటికి తీసుకువస్తున్నారు ఆయ‌న కుటుంబ సభ్యులు.  ఉమ్మ‌డి ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి గా రోశ‌య్య ఏడాదిన్న‌ర కాలం పాటు ప‌నిచేసిన సంగ‌తి తెలిసిందే. అయితే…. తాజాగా రోశయ్య మృతి చెందడంతో రాజ‌కీయ ప్ర‌ముఖులు, అభిమానులు సంతాపం తెలిపుతున్నారు. రేపు ఆయ‌న అంత్య క్రియ‌లు జ‌రిగే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.

 

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. ఆర్ధిక శాఖ మంత్రిగా పలు పదవులకు వన్నె తెచ్చిన రోశయ్య, సౌమ్యుడిగా, సహన శీలిగా, రాజకీయాల్లో తనదైన శైలిని ప్రదర్శించేవారు అని గుర్తు చేసుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం కేసిఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

మాజీ గవర్నర్, మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి ప్రగాఢ సంతాపం.

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, మాజీ తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య మరణం పట్ల వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు సంతాపం ప్రకటించారు. రోశయ్య గారి పేరు వింటేనే ఆర్థిక శాఖ గుర్తుకు వస్తుందని, ఆ పదవికి ఆయన అంతలా పేరు తెచ్చారని అన్నారు.

రోశయ్య మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సంతాపం..మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్, మాజీ పీసీసీ అధ్యక్షులు రోశయ్య అకాల మరణం పట్ల టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.

మాజీ సీఎం కొణిజేటీ రోశయ్య మృతికి టీడీపీ నేతలు లోకేష్, యనమల, నక్కా ఆనందబాబు, సోమిరెడ్డి సంతాపం.

మాజీ సీఎం కొణిజేటి రోశయ్య మృతికి చంద్రబాబు సంతాపం. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపిన చంద్రబాబు.

Read more RELATED
Recommended to you

Latest news