వరి వేయొద్దు అనే హక్కు.. సీఎం కేసీఆర్ కు లేదు.. వైఎస్ ష‌ర్మిల ఫైర్‌

-

వరి వద్దన్నా సీఎం మనకు వద్దని… తెలంగాణ రాష్ట్రంలో వరి వేయొద్దు అనే హక్కు సీఎం కేసీఆర్ కు లేదని వైఎస్ ష‌ర్మిల ఫైర్ అయ్యారు. మెదక్ జిల్లా హావేలి ఘనపూర్ మండలం బొగుడ భూపతిపూర్ లో రైతు రవి కుటుంబాన్ని పరామర్శించారు వైఎస్ షర్మిల. ఈ సంద‌ర్భంగా షర్మిల మాట్లాడుతూ… రైతు భూమిని నమ్ముకొని వ్యవసాయం చేస్తారని.. రైతు గుండె ఆగిపోయేలా కేసీఆర్ చేస్తున్నారని ఆగ్ర‌హించారు.

Sharmila comments on cm kcr
Sharmila comments on cm kcr

వడ్లు వేయాల్సిన రైతు ఉరి ఎందుకు వేసుకుంటున్నారని.. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ది నియంత పాలన అని.. ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఆదుకోవడం లేదని ఫైర్ అయ్యారు. కుటుంబాలను పోషించలేని స్థితిలో రైతులున్నారని… ధాన్యం కుప్పల మీద రైతులు చనిపోయే దౌర్భాగ్య స్థితి తెలంగాణ లో ఉందని వెల్ల‌డించారు. రైతు రవి సీఎం కేసీఆర్ కు లెటర్ రాసి చనిపోవడం బాధాకరమ‌ని.. వరి వేసుకోకపోతే ఊరే వేసుకోవాలని బాధపడి రైతు రవి లెటర్ రాశాడన్నారు. తన భూమిలో వరి పంట పండుతుబడని వరి వేస్తాడని.. పండించిన పంటకు కొనాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేన‌న్నారు. ఆఖరి గింజ వరకు కొంటా అని సీఎం కేసీఆర్ మాట ఇచ్చారని… ప్రభుత్వాలే మాట తప్పుతున్నాయని నిప్పులు చెరిగారు. బంగారు తెలంగాణ అన్నాడు…రైతు బతుకలేకుండా చేస్తున్నాడ‌ని నిప్పులు చెరిగారు.

Read more RELATED
Recommended to you

Latest news