మంత్రి కొడాలి నాని రూలే వేరు.రూటే వేరు కూడా!ఆయన ఏం చెబితే అది చెల్లిపోతుంది.అందుకు ఆధారాలెన్నో!ఆయన ఎంతంటే అంత జరిగితీరుతుంది.అందుకు సాక్ష్యాలు కూడా ఎన్నో! ఆయన మాట వేద వాక్కు అయిన రోజులు ఎన్నో! ఆ మాట శాసనం అన్న విధంగా నడిచిన రోజులు ఎన్నో! అవును! ఆయన ఏం చెప్పినా దానికో లెక్క ఉంటది! ఆ లెక్క పక్కాగా ఉంటుందో లేదో మాత్రం తెలియదు అని అంటున్నారు విపక్ష సభ్యులు.అవును! పండుగ రోజు ఆయన ఊళ్లో చాలా మంది పేకాట క్లబ్బులు నడిపారు అని పసుపు పార్టీ చాలా తీవ్ర స్థాయిలో ఆరోపిస్తుంది.
అంతేకాదు గోవా తరహాలో క్యాసినో నడిపారని కొందరు,అయినా కూడా మంత్రి ఇలాకాలో పోలీసులు చొరబడేందుకు సాహసమే చేయలేకపోయారని కూడా విపక్షం గొంతెత్తుతోంది.ఇంత జరిగినా కూడా మంత్రి తరఫు మనుషులు ఒక్కరంటే ఒక్కరు కూడా తమపై వస్తున్న ఆరోపణల్లో నిజాలు లేవని ఖండించేందుకు ఒక్కరంటే ఒక్కరు ముందుకు రాకపోవడం విడ్డూరం.అయినా సరే! జరిగిందేదో జరిగిపోయింది ఇకపై అయినా పేకాట క్లబ్బులకు తాళాలు పడతాయో లేదో? క్యాసినో తరహా వికృతాలు ఆగుతాయో లేదో? జూదరుల కారణంగా రోడ్డున పడుతున్న కుటుంబాల సంఖ్య ఇకపై అయినా తగ్గుతుందో లేదో?