రెండు రోజుల కింద నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఆర్మూరు నియోజకవర్గంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మంగళవారం పర్యటించారు. ఈ నేపథ్యంలో ఆర్మూర్ నియోజకవర్గానికి చెందిన రైతులు అలాగే టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎంపీ ధర్మపురి అరవింద్ పై దాడికి పాల్పడ్డారు. అరవింద్ గో బ్యాక్ అంటూ నినాదాలతో… ఆయన కారు అద్దాలు పగలగొట్టారు రైతులు.
దీంతో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. పోలీసులు తనను చంపాలని వ్యవహరించారని ఎంపీ అరవింద్ ఆరోపణలు చేస్తున్నారు. పసుపు బోర్డు లేకపోతే పరిస్థితి ఇలాగే ఉంటుందని టిఆర్ఎస్ పార్టీ చెబుతోంది.
ఇక ఇది ఇలా ఉండగా… ఈ సంఘటన నేపథ్యంలో ఇవాళ నిజామాబాద్ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ పర్యటించనున్నారు. కర్నూలు దర్శనం గాయపడ్డ బిజెపి కార్యకర్తలు ఈ సందర్భంగా పరామర్శించనున్నారు. అయితే బండి సంజయ్ నిజామాబాద్ పర్యటన నేపథ్యంలో పోలీసులు హై అలర్ట్ అయ్యారు. ముందస్తు అరెస్టు చేయాలని పోలీసులు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎలాంటి గొడవ కాకుండా చూసుకోవాలి ఎందుకు పోలీసులు సర్వం సిద్ధమయ్యారు.