రైతులను కాపాడేది టీఆర్‌ఎస్‌..ముంచేది కేంద్రం : హరీష్‌ రావు ఫైర్‌

-

రైతులను కాపాడేది టీఆర్‌ఎస్‌..ముంచేది కేంద్రమని.. మంత్రి హరీష్‌ రావు ఫైర్‌ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం రైతును కాపాడే ప్రయత్నం చేస్తే., బీజేపీ ప్రభుత్వం రైతును ముంచే ప్రయత్నం చేస్తున్నదని, రైతులకు పెట్టుబడి వ్యయాన్ని పెంపు చేస్తోందని, కొనుగోలు తగ్గిస్తుందని ఆగ్రహించారు. బీజేపీ ప్రభుత్వం సిలిండర్లు, ఎరువులు ఇతరత్రాలపై సబ్సిడీ పేరిట కోతలు, వాతలు తప్ప కేంద్ర బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజలకు చేసిందేమీ లేదని, టీఆర్ఎస్ పార్టీ నాయకులుగా ఈ విషయాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని పార్టీ శ్రేణులకు మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు.

కేంద్ర బీజేపీ ప్రభుత్వానిది ఉత్తర భారత దేశానికి ఒకనీతి. దక్షిణ భారత దేశానికి ఒకనీతి అంటూ ఆగ్రహించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల కోసం ఉత్తర భారత దేశంలో ధరలు పెంచలేదని, దక్షిణ భారతదేశ ప్రాంతంలో కాంప్లెక్స్ ఎరువులు, యూరియా, డీఏపీ, పొటాషియం ఎక్కువగా వాడతారని ధరలు పెంచి పక్షపాత వైఖరి చూపించిందని నిప్పులు చెరిగారు.

ఉత్తర భారత దేశంలో యూరియా, డీఏపీ ఎక్కువ వాడకం, దక్షిణ భారతదేశంలో కాంప్లెక్స్ ఎరువుల వాడకం ఎక్కువగా ఉంటుందని.., ఉత్తర దేశంలో యూరియా, డీఏపీ ధరలు పెంపు జోలికి పోకుండా, దక్షిణ భారతదేశంలో కాంప్లెక్స్ ఎరువులకు ధరలు పెంపు చేశారని, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల్లో లబ్ధి పొందేలా.. ఉత్తర దేశానికి ఒకనీతి, దక్షిణ దేశానికి ఒకనీతి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వ తీరుపై మంత్రి హరీశ్ విమర్శలు చేశారు. బీజేపీ ప్రభుత్వం తెలంగాణ పై ఎంత వివక్ష చూపుతుందో.. తెలిసేందుకు కేవలం ఇదొక ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news