కమలం పార్టీని టార్గెట్ చేసుకుని కారు పార్టీ దూకుడుగా రాజకీయం చేస్తుంది…తమకు తలనొప్పిగా మరింత కమలానికి ఎలాగైనా చెక్ పెట్టాలని చెప్పి కారు పార్టీ ట్రై చేస్తుంది. అసలు బీజేపీతో ముప్పు ఉందని గ్రహించిన కేసీఆర్…డైరక్ట్‌గా రంగంలోకి దిగి…బీజేపీపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఓ వైపు రాష్ట్రంలో బీజేపీని టార్గెట్ చేస్తూనే, మరోవైపు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటీవల మీడియా సమావేశం పెట్టి మరీ బడ్జెట్ సమావేశాలపై కామెంట్ చేయడమే కాకుండా…రాజ్యాంగం మార్చాలంటూ కొత్త డిమాండ్ తెరపైకి తీసుకొచ్చారు. దీనిపై పెద్ద రచ్చ నడుస్తున్న విషయం తెలిసిందే.
అయితే ఇలా కేసీఆర్ రాజ్యాంగం మార్చాలని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టీఆర్ఎస్‌కు నెగిటివ్‌గా మారేలా కనిపిస్తున్నాయి…అందుకే ఈ అంశాన్ని డైవర్ట్ చేయడానికి టీఆర్ఎస్ నేతలు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రి కేటీఆర్ ఎంట్రీ ఇచ్చి..సరికొత్త టాపిక్‌లని తెరపైకి తీసుకొస్తున్నారు. ఇప్పటికే సింగరేణి ప్రైవేటీకరణపై ఆయన తీవ్రంగా స్పందిస్తూ…ప్రైవేటీకరణ చేస్తే…ఢిల్లీలో కమలానికి సెగ తగులుతుందని అన్నారు.
అలాగే సమతామూర్తి విగ్రహాన్ని పక్షపాతి ఆవిష్కరించారంటూ ప్రధాని మోదీని ఉద్దేశిస్తూ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఇక దీనికి బీజేపీ కౌంటర్లు ఇచ్చే ప్రయత్నం చేశారు. 15 నిమిషాల పాటు పోలీసులను తొలగిస్తే సత్తా చూపిస్తామన్న ఎంఐఎం నేతల వ్యాఖ్యలు, నిజాం రజాకార్ ఆర్మీ హిందువుల ఊచకోత లాంటి అంశాలపై ఒవైసీని, ఎంఐఎంను కేసీఆర్, కేటీఆర్ సమర్థిస్తున్నట్లు అనిపిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
అంటే ఇప్పుడు సమతామూర్తి విగ్రహం విషయంలో రాజకీయం నడుస్తోంది..అయితే కేటీఆర్ కావాలనే ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చినట్లు కనిపిస్తోంది. రాజ్యాంగం వ్యాఖ్యలు డైవర్ట్ చేయడానికే …మోడీపై విమర్శలు చేశారని అర్ధమవుతుంది. ఇక మోడీని అంటే వెంటనే బీజేపీ నేతలు కూడా స్పందిస్తారు..ఇక కేటీఆర్ అనుకున్నట్లే బీజేపీ నేతలు ఈ అంశంపై ఫోకస్ పెట్టారు…దీంతో రాజ్యాంగం వ్యాఖ్యలు డైవర్ట్ చేయడంలో కేటీఆర్ సక్సెస్ అయినట్లు కనిపిస్తున్నారు.