హిజాబ్ వద్దు.. కాషాయం వద్దు.. యూనిఫాంతోనే రావాలి: కర్ణాటక హైకోర్ట్ మధ్యంతర ఉత్తర్వులు

-

కర్ణాటకలో ‘ హిజాబ్’ వ్యవహారంపై కర్ణాటక హైకోర్ట్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈరోజు హిజాబ్ అంశంపై ప్రధాన న్యాయమూర్తి రితూ రాజ్ అవస్థి న్యాయమూర్తులు కృష్ణ ఎస్ దీక్షిత్ మరియు జెఎం ఖాజీలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం వివిధ పిటిషన్లపై విచారణను ప్రారంభించింది. ఈ కేసు విషయంలో న్యాయమూర్తుల వ్యాఖ్యలను కూడా ఏ సోషల్ మీడియాలో పోస్ట్ చేయవద్దని ఆదేశాలు జారీచేసింది. విద్యాలయాల్లో డ్రెస్ కోడ్ పై  ఒత్తడి చేయవద్దని ఆదేశించింది. విద్యాాలయాల్లో మతపరమైన డ్రెస్సింగ్ కు అనుమతి లేదని.. ప్రస్తుత పరిస్థితినే కొనసాగించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. తుది తీర్పు వచ్చే వరకు విద్యార్థులు హిజాబ్ ప్రస్తావన తీసుకురావద్దని సూచించింది. హిజాబ్ వద్దు, కాషాయం వద్దు అంటూ కామెంట్స్ చేసింది. విద్యార్థులంతా యూనిఫాంలోనే స్కూళ్లకు, కాలేజీలకు హాజరుకావాలని ఆదేశించింది. హిజాబ్ వివాదంపై సోమవారానికి విచారణను వాయిదా వేసింది.

Read more RELATED
Recommended to you

Latest news