పాకిస్తాన్ సూపర్ లీగ్ ఆరవ సీజన్ ప్రస్తుతం చివరి రౌండ్ కు చేరుకుంది. ఈ సారి కరోనా లేదా ఉగ్రవాద దాడి భయంతో లీగ్ ఆగిపోలేదు. ఆస్ట్రేలియా క్రికెటర్ జేమ్స్ పాల్క్‌నర్‌కు సంబంధించిన వివాదం పాకిస్తాన్ సూపర్ లీగ్‌ను పెద్ద చిక్కుల్లోకి నెట్టిది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు జీతం చెల్లించడం లేదని పాల్క్ నర్ ఆరోపించారు. ఆగ్రహంతో హోటల్‌లో అమర్చిన షాన్డిలియర్‌పై బ్యాట్, హెల్మెట్ కూడా విసిరాడు.
దీంతో పీసీబీ పాల్క్‌నర్ సీరియస్‌గా తీసుకుని భవిష్యత్‌లో అతన్ని పీఎస్ఎల్ ఆడకుండా నిషేదించింది. ఇలాంటి ఆరోపణలు చేయడం తప్పని పేర్కొంది. లీగ్ నుంచి వైదొలిగిన ఫాల్క్ నగర్ 31ఏళ్ల ఆస్ట్రేలియా ఆటగాడు శనివారం తన ట్విట్టర్ హ్యాండిల్ నుంచి వరుసగా రెండు ట్వీట్లు చేసాడు. పీసీబీ ప్లేయర్లకు డబ్బు చెల్లించడం లేదని ఆరోపించారు. ఆ తరువాత లీగ్‌ను మధ్యలోనే వదిలేస్తున్నట్టు ప్రకటన చేశాడు ఫాల్క్‌నర్.