తెలంగాణ సీఎం కేసీఆర్ ఈరోజు ముంబై పర్యటనకు వెళ్లనున్నారు. దేశంలో తాజా రాజకీయ పరిణామాలపై మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే తో పాటు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తోె భేటీ కానున్నారు. ఇటీవల సీఎం కేసీఆర్ కు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే ఫోన్ చేసిన సంగతి తెలిసిందే. లంచ్ మీటింగ్ కు ముంబై రావాల్సిందని కోరారు. బీజేపీ, కేంద్ర ప్రభుత్వంపై కేసీఆర్ చేస్తున్న ప్రజాస్వామ్య పోరాటానికి అండగా ఉంటామని.. మద్దతు ఇస్తామని ఉద్దవ్ ఠాక్రే తెలిపారు. దీంట్లో భాగంగా ఈ రోజు ఉదయం 11 గంటలకు బేగంపేట నుంచి ముంబై బయలుదేరనున్నారు. ప్రత్యేక విమానంలో ముంబై వెళ్లనున్నారు. మధ్యాహ్నం 1 గంటలకు ఉద్ధవ్ ఠాక్రేతో భేటీ కానున్నారు. సాయంత్రం 4 గంటలకు శరద్ పవార్ తో భేటీ కానున్నారు. రాజకీయాలపై నేతలు చర్చించనున్నారు.
ఇప్పటికే.. కేసీఆర్ కు తమిళనాడు సీఎం స్టాలిన్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, మాజీ ప్రధాని దేవగౌడ సీఎం కేసీఆర్ తో ఫోన్ లో మాట్లాడారు. కేసీఆర్ కు మద్దతు ప్రకటించారు. త్వరలోనే ఎన్డీయేతర సీఎంలతో ఢిల్లీలో సమావేశం నిర్వహించనున్నారు. థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు బీజాలు వేసేలా ఈ సమావేశం ఉందనుంది.