అట్టహాసంగా.. కన్నుల పండగా జరిగింది మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర. ఫిబ్రవరి 16-19 మధ్య సమ్మక్క- సారలమ్మ జాతర జరిగింది. ఈ జాతరకు మన తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా.. చత్తీస్ గడ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశాల నుంచి కూడా భక్తులు తరలివచ్చారు. సమ్మక- సాలరమ్మ తల్లులకు కానుకలు ఇచ్చారు. ఈసారి కూడా మేడారం జాతర సందర్భంగా దేవాదాయ శాఖకు భారీగానే ఆదాయం సమకూరింది. తమ కోరికలు నెరవేర్చాలంటూ.. అమ్మవార్లకు భక్తులు అనేక కానుకలు సమర్పించారు.
తాజాగా మేడారం హుండీ ఆదాయాన్ని లెక్కించింది దేవాదాయ శాఖ. ఈ సారి మేడారం జాతర సందర్భంగా భక్తులు భారీగానే కానుకలు సమర్పించారు. రూ. 10 కోట్లకు పైగానే హుండీ ఆదాయం వచ్చింది. మొత్తం 497 హుండీల్లో రూ. 10,00,63,980 ఆదాయం సమకూరింది. ఇంకా బంగారం, విదేశీ కరెన్సీ లెక్క తేలాల్సి ఉంది. గత జాతరలో రూ. 11.64 కోట్ల ఆదాయం సమకూరింది. కాగా.. గతంలో కన్నా ఈసారి ఆదాయం తగ్గింది.