తెలుగుదేశం పార్టీపై మరో సారి ఏపీ మంత్రి కొడాలి నాని నిప్పులు చెరిగారు. జగన్ మోహన్ రెడ్డి తో యుద్ధం అంటే తెలుగుదేశం పార్టీకి రాజకీయ సమాధే అంటూ చురకలంటించారు కొడాలి నాని. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వైన్ షాప్ లను చాలా వరకు తగ్గించామని ఆయన వెల్లడించారు. చంద్రబాబు నాయుడు వెన్నుపోటు కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారని ఎద్దేవా చేశారు.
తెలుగుదేశం పార్టీ విచ్చలవిడిగా బెల్టు షాపుల అనుమతి ఇస్తే తాము రద్దు చేశామని పేర్కొన్నారు. డిస్తలరీలకు ఎవరూ పర్మిషన్ ఇచ్చారు ఆధారాలతో చూపించామని కొడాలి నాని స్పష్టం చేశారు. బార్లు కోర్టు స్టే మీద నడుస్తున్నాయని ఆయన వెల్లడించారు. చంద్రబాబు నాయుడు బార్లకు ఆరు సంవత్సరాలు అనుమతులు ఎలా ఇచ్చారని నిలదీశారు. ఏపీ ప్రజలకు మంచి పాలన అందిస్తామనే నమ్మకంతోనే… 2019 లో వైసీపీ కి పట్టం కట్టారని.. పేర్కొన్నారు. ఇక ఏపీలో తెలుగు దేశం పార్టీకి డిపాజిట్ గల్లంతు కావడం ఖాయమన్నారు.