ఉక్రెయిన్ పై రష్యా అణు దాడి చేసే అవకాశం: బ్రిటిష్ ఇంటలిజెన్స్

-

ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రకటించి 50 రోజులు దాటింది. అయినా రష్యా ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఉక్రెయిన్ లోని పలు నగరాలను ఇప్పటికే ధ్వంసం చేసింది. రాజధాని కీవ్ తో సహా మరియోపోల్, ఖార్కీవ్, సుమి వంటి నగరాలను మసిదిబ్బలుగా చేసింది. రాజధాని కీవ్ ను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించినా…. రష్యా దళాలకు సాధ్య పడటం లేదు. యుద్ధం ప్రారంభం అయిన తర్వాత వారం రోజుల్లోనే ఉక్రెయిన్ రష్యా ఆధీనంలోకి వస్తుందని అంతా భావించినప్పటికీ…. ఉక్రెయిన్ బలగాలు రష్యాను ధీటుగా ఎదురుకున్నాయి. అమెరికా, బ్రిటన్ వంటి నాటో దేశాలు ఇచ్చిన క్షిపణులు, సైనిక సామాగ్రిలో రష్యా యుద్దవిమానాలు, ట్యాంకులు, హెలికాప్టర్లను ధ్వంసం చేశాయి.

ఇదిలా ఉంటే కీవ్ ను స్వాధీనం చేసుకోలేక రష్యా బలగాలు వెనుదిరిగాయి. అయితే కొత్తగా ఉక్రెయిన్ తూర్పు భాగం నుంచి రష్యా దాాడులను ముమ్మరం చేసింది. ఉక్రెయిన్ లోని మరియోపోల్ నగరాన్ని దాదాపుగా రష్యా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఇదిలా ఉంటే గత కొన్నాళ్ల నుంచి ఉక్రెయిన్ తలొగ్గకపోవడంతో రష్యా అణుదాడి చేసే అవకాశం ఉందని బ్రిటిష్ ఇంటలిజెన్స్ హెచ్చరించింది. ఇది జరిగితే ఉక్రెయిన్ తీవ్రస్థాయిలో దెబ్బతింటుంది.

Read more RELATED
Recommended to you

Latest news