మెగా అభిమానులే కాదు సినీ లవర్స్ అందరూ కూడా ‘ఆచార్య’ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ నెల 29న పిక్చర్ రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే మేకర్స్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. తొలి ఇంటర్వ్యూ ఇచ్చేశారు. దర్శకులు కొరటాల శివ, హీరో రామ్ చరణ్ తేజ్ ‘ఆచార్య’ విశేషాలు పంచుకున్నారు. ఈ నెల 23న ప్రీ రిలీజ్ ఈవెంట్ తెలంగాణలోని హైదరాబాద్ యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో జరగనుంది.
వెండితెరపైన తండ్రీ తనయులు చిరంజీవి-రామ్ చరణ్ లను చూసేందుకు అభిమానులు ఎంతలా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాగా, తాను తన తండ్రి చిరంజీవితో వర్క్ చేయడం కూడా గొప్ప విషయమని, ఆ అనుభూతిని మాటల్లో చెప్పలేనని రామ్ చరణ్ తాజా ఇంటర్వ్యూలో తెలిపారు. ‘ఆచార్య’ వలన తనకు తన తండ్రితో కలిసి నటించే అవకాశం వచ్చిందని, కొరటాల శివకు థాంక్స్ చెప్పాడు మెగా పవర్ స్టార్.
ఇక సినిమా షూటింగ్ టైంలో తను, తన తండ్రి ప్రతీ రోజు ఉదయాన్నే కారులో సెట్స్ కు బయలు దేరామని, తాను ప్రతీ రోజు డ్రైవింగ్ చేసేవాడినని రామ్ చరణ్ తెలిపారు. కాటేజ్ నుంచి అలా సెట్స్ కు దాదాపు 20 రోజుల పాటు వెళ్లి షూట్ కంప్లీట్ చేశామని చెప్పుకొచ్చారు చరణ్. ఈ క్రమంలోనే తన తండ్రితో స్పెండ్ చేసిన టైమ్ గొప్పగా నిలిచిపోతుందని అన్నారు.
తాను ఒక రోజు ఈ అనుభూతిని ఎలా చెప్పాలో తెలియక కన్నీటి పర్యంతమై, తన తండ్రిని కౌగలించుకున్నానని వివరించారు రామ్ చరణ్. ‘ఆచార్య’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా పవర్ స్టార్ పవన్ కల్యాణ్, ఎస్.ఎస్.రాజమౌళి వస్తారని వార్తలొస్తున్నాయి. అయితే, ఈ విషయమై మేకర్స్ నుంచి ఎటువంటి అఫీషియల్ అనౌన్స్ మెంట్ అయితే రాలేదు.