పోలీసులు సామాన్యుల ధన, మాన, ప్రాణాలను కాపాడేందుకు ఉంటారని కానీ… సామాన్యుడినే పోలీసులు వేధింపులకు గురిచేస్తుండటంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు కాంగ్రెస్ నేత మల్లు బట్టి విక్రమార్క. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ చెప్పినట్లు పోలీస్ వ్యవస్థ పనిచేస్తోందని ఆరోపించారు. పోలీసులు వాళ్లు చేయాల్సిన పని వారు చేయకుండా… టీఆర్ఎస్ నాయకులకు కొమ్ము కాస్తున్నారని.. ఇది సమాజానికి మంచి పద్దతి కాదని అన్నారు. వ్యవస్థను రాజకీయ పార్టీ అవసరాల కోసం వాడుకోవడం వల్ల సమాజంలో అల్లకల్లోలం చెలరేగుతుందని ఆయన అన్నారు. ఖమ్మంలో సాయిగణేష్ ఆత్మహత్య, కామారెడ్డిలో తల్లి కోడుకులు పద్మ, సంతోష్ ఆత్మహత్యలకు టీఆర్ఎస్ నాయకులు, పోలీసులు వేధింపులే కారణం అని ఆయన విమర్శించారు. గతంలో ఎన్నో రాజకీయ పార్టీలు పాలన చేసినా… పోలీసులను ఈ విధంగా వాడుకోలేదని అన్నారు. రాజకీయ కక్ష సాధింపులు, వేధింపుల కోసం పోలీసులు పీడీయాక్ట్ లు పెడుతున్నారని విమర్శించారు. రాజకీయంగా ప్రతిపక్షాలను వేధించేందుకు అధికార పార్టీ ఈ రకమైన చర్యలకు చేస్తుందని విమర్శించారు.
టీఆర్ఎస్ చెప్పినట్లు రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పనిచేస్తోంది: బట్టి విక్రమార్క
-