వెనక్కి తగ్గిన డియర్ కామ్రేడ్

-

విజయ్ దేవరకొండ హీరోగా భరత్ కమ్మ డైరక్షన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా డియర్ కామ్రేడ్. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన రష్మిక మందన్న నటిస్తుంది. రీసెంట్ గా రిలీజైన ఈ సినిమా టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది. మే 31న రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమాకు పోటీగా రెండు సినిమాలు వస్తున్నాయి.

డియర్ కామ్రేడ్ తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ భాషల్లో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. అయితే అదేరోజు తమిళంలో సూర్య నటించిన ఎన్.జి.కే సినిమా రిలీజ్ కాబోతుంది. విక్రం నటించిన కదరం కొండన్ సినిమా కూడా అదే రోజు రిలీజ్ ప్లాన్ చేశారు. కోలీవుడ్ లో ఇద్దరు టాప్ స్టార్స్ కు పోటీగా డియర్ కామ్రేడ్ రిలీజ్ కష్టమని భావించి రెండు వారాల తర్వాత డియర్ కామ్రేడ్ రిలీజ్ చేస్తారట. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news