బర్త్ డే బోయ్ : ఫార్ములా ఒన్ కుర్రాడు .. అజిత్

-

ఏటి గ‌ట్టూ పూల చెట్టూ చెప్పెన‌మ్మా సంగ‌తులు.. అని పాడుకోండిక.. ఇవాళ ఆయ‌న బ‌ర్త్ డే మ‌రి ! ఫార్ములా ఒన్ కుర్రాడు అత‌డు. ఇంకా చెప్ప‌నా ! అమ్మాయిల క‌ల‌ల రాకుమారుడు కూడా ! అంత ఇమేజ్ ఉందా కానీ ఎక్క‌డా ఆర్భాటం ఉండ‌దు. అంత హిట్ మానియా ఉందా కానీ త‌గ్గి త‌లొగ్గి జీవితాన్ని ముందుకు తీసుకువెళ్లే స‌మ‌ర్థుడు. ఆయ‌నే త‌మిళ హీరో అజిత్.. మ‌న తెలుగు లోగిళ్ల‌కూ ప‌రిచ‌యం తో పాటు ఎంతో అనుబంధం ఉన్న క‌థానాయ‌కుడు.

90ల‌లో కుర్ర‌కారు ఇలా లేరు. వేరే విధంగా ఉన్నారు. ఆ విధంగా వాళ్ల‌కు ఒకడు న‌చ్చాడు. ఫ‌క్తు ప్రేమ క‌థ‌లతో అల‌రించాడు. ఆ హీరో ఇప్ప‌టికీ అలానే ఉన్నాడే ! ప్రేమ‌లేఖ‌లు ఏమ‌య్యాయో కానీ ఇప్పుడూ అప్పుడూ ఆయ‌న ఓ యంగ్ త‌రంగ్ ఆయ‌నే అజిత్.

రాజ‌స్థానీ క‌న్నేపిల్లా వ‌య‌సుకు వ‌న్నెలు వ‌చ్చిన వేళ అని పాడుకున్న కుర్రాడు. కొన్నంటే కొన్ని చిత్రాల‌తో క్రేజ్ తెచ్చుకున్నాడు. తమ బోయ్ నెక్ట్స్ డోర్ అంటే అత‌డే ! అటువంటి పుల‌కింతల నేప‌థ్యంలో అటువంటి గిలిగింత‌ల నేప‌థ్యంలో ఓ కుర్రాడు హాయిగా చెన్న‌య్ టు హైద్రాబాద్ వ‌చ్చాడు. ఇక్క‌డ అంద‌రికీ చేరువ అయ్యాడు. మిస్ట‌ర్ పెర్ఫెక్ట్ అజిత్ జీవితం ఓ గొప్ప స్ఫూర్తి.

తమిళ హీరో అజిత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..ప్రేమలేఖ సినిమా నుంచి ఇప్పటివరకు అదే లుక్ నూ అదే క్రేజ్ నూ కొనసాగిస్తున్నాడు. వయస్సు పెరిగే కొద్దీ ఎవరికైనా లుక్ మారుతుంది. కానీ అజిత్ విషయంలో అలా జరగలేదు..రాను రాను మరీ ! యంగ్ అవుతున్నాడు..ఈరోజు ఆయన 51వ పుట్టినరోజు. శుభాకాంక్ష‌లు చెబుతూ రాస్తున్న క‌థ‌నం ఇది.

19 ఏళ్ల వయసులో ఈ సౌత్ సూపర్ స్టార్ ఓ తమిళ సినిమాలో సైడ్ రోల్ తో తన సినీ కెరీర్ ను ప్రారంభించాడు.తమిళంలో 60కి పైగా సినిమాలు చేశాడు. తమిళంలో శ్రీదేవితో కలిసి ‘ఇంగ్లీష్ వింగ్లీష్’ సినిమాకి పనిచేశారు. అజిత్ కుమార్‌కు దక్షిణ భారత చిత్రాలకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును కూడా అందుకున్న విషయం అందరికి తెలిసిందే..అంతేకాదు మూడు సార్లు సినిమా ఎక్స్‌ప్రెస్ అవార్డు కూడా దక్కించుకున్నాడు..ఆయన పుట్టిన రోజు సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలు మీ కోసం..

సాదాసీదాగా జీవిస్తాడు. పాల ప్యాకెట్ కోసం కూడా లైన్ లో ఉంటాడు. వెరీ నార్మ‌ల్.. డౌన్ టు ఎర్త్.. భార్య షాలిని ఇతర కుటుంబ స‌భ్యులు పిల్ల‌లు వీరే లోకం అని బ‌తికే స‌గ‌టు జీవి. ఆయ‌న‌కు ఫార్ములా ఒన్ రేస్ లు అంటే యమ ఇష్టం..అందుకే ఎప్పుడూ ఏదొక రేస్ లో పాల్గొంటాడు. జాతీయ, అంతర్జాతీయ రేస్ లలో పాల్గొన్నాడు. ఏరో మోడలింగ్‌పై కూడా ఆసక్తి చూపిస్తుంటాడు. ఇది హాబీగా చేస్తుంటాడు. పైలట్ లైసెన్స్ కూడా కలిగి ఉన్నాడు..

మరో విషయం ఏంటంటే అజిత్ కు పుస్తకాలు చదివే అలవాటు కూడా వుంది.ఎంత బిజీగా ఉన్నా ఏదొక బుక్ ను చదువుతాడు. సూపర్ స్టార్ రజనీకాంత్ తనకు బహుమతిగా ఇచ్చిన ‘లివింగ్ విత్ ది హిమాలయన్ మాస్టర్స్’ తన అభిమాన పుస్తకంగా చెబుతాడు. ఇకపోతే ఫొటోలు తియ్యడం అన్నా అజిత్ కు చాలా ఇష్టం. ఆ మ‌ధ్య త‌న భార్య చెల్లెలు షామిలి (ఓయ్ సినిమా ఫేం) ఫొటో షూట్ కూడా త‌నే చేశాడు. ఇక భార్య ఇష్ట స‌ఖి తోనే త‌న జీవితం అని చెబుతాడు. ఆమె స‌ఖి ఫేం షాలిని అని వేరే చెప్ప‌న‌క్క‌ర్లేదు.

ఫొటోగ్ర‌ఫీ అంటే త‌న‌కు హాబీ క‌నుక ఆ రంగంపై ఉన్న మ‌మ‌కారాన్ని వీడ‌లేక తన ‘వీరమ్’ సినిమా షూటింగ్ సమయంలో, అజిత్ తన సహనటుల చిత్రాలను కూడా క్లిక్ చేసి, ఆ ఫొటోలను అందరికి గిఫ్ట్ గా పంపాడు. తన కెరియర్ ఆరంభంలో మెకానిక్ గా పని చేశాడు. సినిమాలలో మంచి సక్సెస్ రావడంతో మ‌ళ్లీ అటు వైపు వెళ్ళలేదు..ఒక పెద్ద హీరో అయిన కూడా సాదా సీదా మనిషిలాగా ఉంటూ జనాల్లో మంచి అభిమానాన్ని చూరగొన్నాడు. ఇలాగే ఎప్పుడూ ఆయురారోగ్యాలతో వెయ్యి సినిమాలకు పైగా చేయాలని, ఫ‌క్తు ఫార్ములాల‌కు దూరంగా ఉండాల‌ని ఈ వేదాళం ఫేం ను కోరుకుంటూన్నాము.. హ్యాపీ బర్త్ డే అజిత్..

Read more RELATED
Recommended to you

Latest news