అందుకే ఓయూలో పర్యటనకు అనుమతివ్వలేదు : భట్టి విక్రమార్క

-

ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటిసున్న విషయం తెలిసిందే. అయితే.. రాహుల్ పర్యటనలో భాగంగా.. ఉస్మానియా యూనివర్సిటీని సందర్శించేందుకు, ఓయూ విద్యార్థులతో మాట్లాడేందుకు ఓయూ వీసీ అనుమతి కోరగా నిరాకరించారు.. అయితే నేడు రాహుల్ పర్యటనలో భాగంగా వరంగల్ సభలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఉస్మానియా యూనివర్సిటీలో జరుగుతోన్న తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికే అనుమతివ్వలేదని ఆరోపించారు. చంచల్ గూడ జైలులో ఉన్న పార్టీ నాయకులను కలువడానికి పర్మిషన్ ఇవ్వకపోవడం తెలంగాణ ప్రభుత్వం పరాకాష్టకు నిదర్శనమన్న భట్టి.. ‘గౌరవ పార్లమెంటు సభ్యుడు వచ్చి విద్యార్థులను కలుస్తానంటే.. వద్దని చెప్పడం అక్కడ ఏదో తప్పిదాలు జరుగుతున్నాయి.. ఉస్మానియా యూనివర్సిటీని అణగదొక్కుతున్నారన్నారు.

Bhatti Vikramarka to embark on Telangana tour from February 9

అక్కడకు వస్తే విద్యార్థులు అన్ని విషయాలు మాట్లాడితే.. అన్నీ బయటకు వస్తాయనే భయం పట్టుకున్నట్లుంది అని పేర్కొన్నారు భట్టి విక్రమార్క. ‘రాహుల్ గాంధీ చిన్న వ్యక్తి ఏమీ కాదు.. కదా.. జాతీయ పార్టీకి అధ్యక్షుడుగా పనిచేసిన వ్యక్తి.. అంతే కాదు ఎంపీ కూడా.. ఆయన జాతీయ నాయకుడు కాబట్టి అన్ని రాష్ట్రాలు తిరుగుతుంటారు… ఇక్కడకు అలాగే వస్తున్నారు.. రాహుల్ గాంధీ ఓయూ సందర్శనకు అనుమతివ్వకపోతే ఏం చేయాలో పార్టీ నేతలంతా చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు భట్టి..

Read more RELATED
Recommended to you

Latest news