ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉందని.. కానీ : పవన్‌ కళ్యాణ్‌

-

జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ నేడు కర్నూలు జిల్లా రైతు భరోసా యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉందని.. కానీ ఏపీ భవిష్యత్ కోసం ప్రత్యామ్నాయ ప్రభుత్వం రావాలని పవన్ అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే అంతిమంగా ప్రజలకే నష్టం చేకూరుతుందన్న పవన్‌.. ప్రజలకు ఉపయోగపడేలా పొత్తులు ఉండాలని, ఏపీ నిర్మాణానికి అన్ని పార్టీలు కృషి చేయాల్సిన అవసరం ఉందని పవన్‌ వ్యాఖ్యానించారు.

Pawan Kalyan: Irks Friends, Disappoints Fans!

ప్రస్తుతం బీజేపీతో తమ పొత్తు కొనసాగుతోందని.. మోదీ, అమిత్ షా అంటే తనకు చాలా గౌరవం ఉందన్నారు పవన్. సోము వీర్రాజు ఏం మాట్లాడారో తనకు తెలియదని.. ఆయన వ్యాఖ్యలు విన్నాక స్పందిస్తానని క్లారిటీ ఇచ్చారు. 151 మంది ఎమ్మెల్యేలు ఉండి కూడా వైసీపీ ప్రభుత్వం సరిగ్గా పరిపాలన చేయడం లేదని పవన్ ఆరోపించారు. తాము ఏం చేసినా తిరుగు ఉండదనే విధంగా వైసీపీ నేతలు దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే ఏపీ ఆర్ధిక పరిస్థితి మరింత దిగజారిపోతుందని.. అప్పుడు ఏపీకి భవిష్యత్ ఉండదని పవన్ అన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news