హనీమూన్ ట్రిప్‌కు ట్రెయిన్ మొత్తం బుక్ చేశాడు..!

-

సాధారణంగా హనీమూన్‌కు వెళ్లే వాళ్లు ఏం చేస్తారు. వాళ్లు వెళ్లే ప్లేస్‌కు టికెట్లు బుక్ చేసుకుంటారు. అయితే విమానం లేదంటే ట్రెయిన్… మరీ లేదంటే బస్సు, ఇంకా లేదంటే సొంత వాహనంలో వెళ్తారు. అయితే.. బ్రిటన్‌కు చెందిన దంపతులు గ్రాహం విలియం మాత్రం తన హనీమూన్‌కు ఏకంగా ట్రెయిన్ మొత్తాన్ని బుక్ చేసుకున్నాడు. ట్రెయిన్ మొత్తం బుక్ చేసుకొని ఏం చేసుకుంటాడనేగా మీ డౌట్. ఆయన హనీమూన్ .. అయనిష్టం.. మనకెందుకు అనుకోలేం. ఆయన ట్రెయిన మొత్తం బుక్ చేసుకోవడానికి ఓ కారణం కూడా ఉందండోయ్.

హిల్ టూరిజంలో భాగంగా.. నీలగిరి పర్వత రైల్వేలో మెట్టుపాలయం నుంచి ఊటీ వరకు నడుస్తుంది ఈ ట్రెయిన్. ఈ ట్రెయిన్ ప్రత్యేకత ఏంటంటే.. ఈరైలు నీలగిరి కొండల్లో ప్రయాణిస్తుంది. అదే దీని స్పెషాలిటీ. అందుకే ట్రెయిన్ మొత్తాన్ని మనోడు బుక్ చేశాడు. మొత్తం 120 మంది ఈ ట్రెయిన్‌లో ప్రయాణించొచ్చట. ఈ ట్రెయిన్ ఎక్కితే ఏంచక్కా ప్రకృతిని ఆస్వాదించుకుంటూ దాదాపు 13 సొరంగాల మధ్య ప్రయాణిస్తూ వెళ్లొచ్చు. అలా.. ఎవరూ లేకుండా ఏకాంతంగా ప్రకృతిని ఆస్వాదించాలన్నదే వాళ్ల ప్లాన్ అట. అందుకే దాదాపు మూడు లక్షల రూపాయలను చెల్లించి ఐఆర్‌సీటీసీ ద్వారా ట్రెయిన్ మొత్తాన్ని బుక్ చేయించుకున్నాడు. ఈ ట్రెయిన్‌కు ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. ఈ ట్రెయిన్ సర్వీసులను 2004లోనే ఆపేశారట. తిరిగి రీసెంట్‌గా ప్రారంభించారట. తిరిగి ఈ సర్వీసు ప్రారంభం కాగానే ఆ దంపతులు ట్రెయిన్ మొత్తాన్ని బుక్ చేసుకోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది.

Read more RELATED
Recommended to you

Latest news