ఈ రోజుల్లో నడుం నొప్పి ఎంతోమందిని వేధిస్తుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా.. ఇది ఇంకా ఎక్కువైంది. యువతలోనే బ్యాక్ పెయిన్ కేసులు ఎక్కువగా వస్తున్నాయని వైద్యులు అంటున్నారు. నొప్పి భరించలేక ఏదో ఒక పెయిన్ కిల్లర్ లేదా ఆయింట్మెంట్ రాసుకుంటున్నారు. కానీ తరచూ నొప్పి వస్తుంటే మాత్రం అశ్రద్ద చేయకూడదంటున్నారు వైద్యులు.. ఇది వెన్నుపాము పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. భవిష్యత్తులో ఇంకా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే డైలీ కొందరికి వ్యాయామాలు చేయడం అలవాటుగా ఉంటుంది. మరి నడుం నొప్పిఉన్నప్పుడు కూడా.. వ్యాయామం చేయొచ్చా లేదా..! మొండిగా చేయడం వల్ల ఏమైనా సమస్యలు వస్తాయా.. లేదా ఉపశమనం ఉంటుందా..? ఈ విషయం ఈరోజు తెలుసుకుందా..!
వ్యాయామాలు రోజూ చేయడం వల్ల..
బ్యాక్ పెయిన్ (Back pain) ఉన్నవారు వెన్నెముకకు బలాన్నిచ్చే వ్యాయామాలు రోజూ చేయడం వల్ల నడుం నొప్పికి చెక్ పెట్టవచ్చు. నొప్పి ఉన్న చోట సహజసిద్ధమైన పద్ధతులు పాటించడంతో పాటు శరీరంపై తక్కువ తీవ్రతను చూపే యోగ, ఈత వంటి సులభమైన ఎక్సర్సైజులు చేయాలి.
నడుం నొప్పితో పాటు జ్వరం, మలబద్ధకం,మూత్ర విసర్జన మీద పట్టు కోల్పోవడం మొదలైన సమస్యలు ఉంటే.. కచ్చితంగా వైద్యులను సంప్రదించటం ఉత్తమం. నడుమునొప్పిని ఆయుర్వేదం (Ayurveda)లో కటిశూల అంటారు. ఇదొక వాత ప్రధాన వ్యాధి.
ఈ ఆసనాలతో చక్కటి పరిష్కారం..
దీనికి స్నేహనం, స్వేదనం, అగ్నిదీపనం, వస్తకర్మ, వేదనాశ్యామక, వాతనాశిక అనేవి ఔషధాలు. నడుము నొప్పితో ఎక్కువ బాధ పడుతుంటే 100 గ్రాములు గసగసాలను మెత్తగా నూరి పొడి చేసుకుని ఈ పొడిని ఒక చెంచా మోతాదులో క గ్లాస్ నీళ్ళలో కలుపుకుని తాగాలి. ఇంకా..నడుం నొప్పి బాధ నుంచి ఉపశమనం పొందడానికి కొబ్బరి నూనె గానీ, నీలగిరి తైలం కానీ, గోరువెచ్చగా చేసి నొప్పి ఉన్నచోట మసాజ్ చేయడం వల్ల నొప్పి నుండి విముక్తి కలుగుతుంది. సో.. నొప్పి ఉంది కదా అని వ్యాయామాలను మానేయకుండా.. నొప్పి తగ్గించే ఎక్సర్సైజును చేస్తుంటే.. నడుంనొప్పి తర్వగా తగ్గుతుంది.