జూబ్లీహిల్స్ రేప్ ఘటనలో విచారణ ముమ్మరం

-

జూబ్లీ హిల్స్ రేప్ ఘటనపై విచారణ ముమ్మరం చేశారు. ఈ ఘటనలో నిందితుల్లో మేజర్ గా ఉన్న సాదుద్దీన్ మాలిక్ ను మూడు రోజుల కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. నేడు చంచల్ గూడ జైల్ నుండి మాలిక్ ను కస్టడీలోకి తీసుకోనున్నారు జూబ్లీహిల్స్ పోలీసులు. మరోవైపు జువైనల్ హోమ్ లో ఉన్న ఐదుగురు నిందితులను వారం రోజులు పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. జువైనల్ కోర్ట్ లో ఈ రోజు కస్టడీ పిటిషన్ పై విచారణ జరగనుంది.  ఏ-1గా ఉన్న సాదుద్దీన్ ను విచారించనున్నారు. నిందితుల ప్రొఫైల్స్, మైనర్స్ తో ఒకరికొకరు ఎలా పరిచయం అయ్యారనే దానిపై పోలీసులు ప్రశ్నించనున్నారు. బాలికను ఎలా ట్రాప్ చేశారు. బెంజ్ కార్ ఎవరు ఇచ్చారు వంటి ప్రశ్నలు అడగనున్నారు. నేరం జరిగిన ప్రాంతంలో పోలీసులు సీన్ రికన్‌స్ట్రక్షన్ చేయనున్నారు. మొత్తం ఆరుగులు నిందితుల్లో ఒక్కరు మాత్రమే మేజర్ కాగా.. మిగిలిన 5 మంది మైనర్లు. వీరందరిపై సామూహిక అత్యాచారం 376 డీ, పోక్సో చట్టం, కిడ్నాప్, ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేశారు.

 

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news