మింగను మెతుకు లేదు కానీ మీసాలకు సంపంగి నూనె అనే సామెత వినే ఉంటారు..దానికి సరిగ్గా తగ్గట్లు ఓ పెళ్ళి జరిగింది..ఆగండి మనుషుల పెళ్ళి కాదు సామీ..కుక్కలకు పెళ్ళి..ఇదెందబ్బా అనుకుంటూన్నారా..కాస్త ఆగండి వివరంగా తెలుసుకుందాం..ఇలాంటి ఘటనే జరిగింది ఉత్తరప్రదేశ్ లోని హమీర్పూర్ జిల్లా సుమెర్పూర్ లో . ఇద్దరు సాధువులు తాము పెంచుకున్న శునకాలకు హిందూ సంప్రదాయం ప్రకారం ఘనంగా పెళ్లి చేశారు.
అంతే కాదు గ్రాండ్ గా భారీ ఊరేగింపు నిర్వహించారు. భరువగా గ్రామంలో ఈ వింత వివాహం జరిగింది.ఏంటో ఈ పిచ్చి.మనసర్ బాబా శివాలయంలోని ప్రధాన పూజారి అయిన స్వామి ద్వారాక దాస్ మహారాజ్ ఓ శునకాన్ని పెంచుకుంటున్నారు. దానికి పెళ్లిచేయాలని భావించి…పరచావ్ లోని బజరంగబలి ఆలయ పూజారి అర్జున్ దాస్ పెంచుకుంటున్న శునకంతో వివాహం చేయాలని నిశ్చయించారు. అంతే ఇక ఈ నెల 5న ముహుర్తం ఫిక్స్ చేశారు. ఈ మ్యారేజ్ కు తన శిష్యులు, భక్తులను ఆహ్వానించారు. శునకాలకు హిందూ సంప్రదయం ప్రకారం శాస్త్రోక్తంగా పెళ్లి చేశారు. భూరి, కల్లూ అనే ఈ శునకాల వివాహానికి హాజరైన వారికి పసందైన వంటకాలను వడ్డించారు. వివాహం తర్వాత 500మందితో బరాత్ నిర్వహించారు..
పెళ్ళి ఎలా జరుగుతుంది అని చూడటానికి వచ్చిన వారి సంఖ్య ఎక్కువ కావడంతో ఆ ప్రాంతం అంతా సందడిగా సాగింది. ఈ వివాహ వేడుకకు సంభందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతుంది.. వధువు భూరి మెడ మంగళసూత్రం స్పెషల్ అట్రాక్షన్ గా నిలించింది. ఈ వివాహంపై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు..ఇక ఆలస్యం ఎందుకు మీరు ఆ వీడియో పై ఒక లుక్ వేసుకోండి..
View this post on Instagram