మంగ‌ళ‌గిరిలో నారా లోకేష్ గెలుపు ఖాయ‌మేనా..? రివ్యూ చేయించిన చంద్ర‌బాబు..?

-

సీఎం చంద్ర‌బాబు మంగ‌ళ‌గిరిలో గెలుపు ఎవ‌రిది అని చేయించిన సర్వేలో మాత్రం లోకేష్ గెలుస్తార‌ని తేలింద‌ట‌. దీంతో టీడీపీ వ‌ర్గాలు ఫుల్ ఖుషీలో ఉన్నాయట.

ఎన్నిక‌ల ఫ‌లితాల తేదీ ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ రాజ‌కీయ నాయ‌కుల్లో రోజు రోజుకీ టెన్ష‌న్ ఎక్కువైపోతోంది. త‌మ పార్టీ అధికారంలోకి వ‌స్తుందా, రాదా, తాము గెలుస్తామా, లేదా అని నేత‌లు దిగులు చెందుతున్నారు. ఫ‌లితాలు ఎలా ఉండ‌బోతున్నాయోన‌ని భ‌య‌ప‌డుతున్నారు. అయితే అంద‌రి ఆందోళ‌న ఒక వైపు ఉంచితే.. మ‌రో వైపు మంగ‌ళ‌గిరిలో నారా లోకేష్ గెలుపుపై టీడీపీ వ‌ర్గాల్లో అదోరక‌మైన ఆందోళ‌న నెల‌కొంది. ఇంత‌కీ అస‌లు.. మంగ‌ళ‌గిరిలో నారా లోకేష్ గెలుస్తారా..? చ‌ంద్ర‌బాబు చేయించిన రివ్యూలో ఏం తేలింది..? అంటే…

మంగ‌ళ‌గిరిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి నారా లోకేష్‌కు గట్టి పోటీనిచ్చిన విష‌యం విదిత‌మే. అయితే మంగ‌ళ‌గిరిలో లోకేష్ గెలుపు అంత ఈజీ కాద‌ని రాజ‌కీయ పండితులు చెబుతున్నారు. ఎందుకంటే.. ఆళ్ల రామ‌కృష్ణా రెడ్డికి మంగ‌ళ‌గిరిలో మంచి పేరుంది. స్థానికులు ఏ చిన్న స‌మ‌స్య వ‌చ్చినా ఆయ‌న దృష్టికి తీసుకువ‌స్తే ఆయ‌న వెంట‌నే స‌మ‌స్య ప‌రిష్క‌రిస్తార‌ని చెప్పుకుంటారు. పేద‌ల‌కు ఆపన్న హ‌స్తం అందించే మంచి నాయ‌కుడిగా రామ‌కృష్ణారెడ్డికి మంగ‌ళ‌గిరిలో పేరుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుంటే.. మంగ‌ళ‌గిరిలో లోకేష్ గెలుపు అంత సుల‌భం కాద‌ని సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు కూడా తెలిసిపోతుంది.

అయితే సీఎం చంద్ర‌బాబు మంగ‌ళ‌గిరిలో గెలుపు ఎవ‌రిది అని చేయించిన సర్వేలో మాత్రం లోకేష్ గెలుస్తార‌ని తేలింద‌ట‌. దీంతో టీడీపీ వ‌ర్గాలు ఫుల్ ఖుషీలో ఉన్నాయట. చిన‌బాబు గెలుపు కోసం టీడీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు మంగ‌ళ‌గిరిలో వేచి ఉన్నార‌ట‌. అయితే మ‌రోవైపు బెట్టింగ్ వర్గాల్లో మాత్రం తేడాగా ఉంది. ఎందుకంటే మంగ‌ళ‌గిరిలో గెలుపెవ‌రిది అని కాస్తున్న బెట్టింగ్‌ల‌లో 99 శాతం మంది రామ‌కృష్ణారెడ్డి గెలుస్తాడ‌నే బెట్ కాస్తున్నార‌ట‌. నారా లోకేష్ గెలుస్తాడ‌ని ఎవ‌రూ పందెం కాయ‌డం లేద‌ట‌. దీన్ని బ‌ట్టి చూస్తే మంగ‌ళ‌గిరిలో రామ‌కృష్ణా రెడ్డి గెలుపు తథ్య‌మ‌ని తెలుస్తుంది. అయితే ఇంకా ఎన్నిక‌ల ఫ‌లితాలు రాలేదు క‌నుక‌.. ఇప్ప‌టికైతే మ‌నం అంచ‌నాలు మాత్ర‌మే వేయ‌గ‌లం. ఈ క్ర‌మంలో అస‌లు ఫ‌లితం తేలాలంటే ఈ నెల 23వ తేదీ వ‌ర‌కు వేచి చూడ‌క త‌ప్ప‌దు..!

Read more RELATED
Recommended to you

Latest news