ఆ వివరం ఈ కథనంలో…
జూబ్లీ హిల్స్ గ్యాంగ్ రేప్ నిందితులకు బిర్యానీలు పెట్టారు పోలీసులు అని వార్తలొస్తున్నాయి. సీన్ రీ కన్ స్ట్రక్షన్ తరువాత జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ కు చేరుకున్న మైనర్లకు వారి పరిచయస్థుల ద్వారా స్టార్ హోటల్ నుంచి తెప్పించిన బిర్యానీలు అందాయి. సాధారణంగా కస్టడీలో ఉన్న నిందితులకు భోజన ఏర్పాట్లు పోలీసులే చేయాలి. కానీ ఇక్కడ మాత్రం ఇందుకు భిన్నంగా పోలీసులు వ్యవహరించారన్న ఆరోపణలు వస్తున్నాయి. దీంతో నిందితుల విషయమై పోలీసులు ఈ విధంగా వ్యవహరించడాన్ని పలువురు ఆక్షేపిస్తున్నారు. ఓ వైపు దర్యాప్తులో ఎటువంటి పురోగతి లేదని విమర్శలు వస్తుంటే మరోవైపు నిందితులకు బిర్యానీలు పెట్టించిన వార్త వెలుగులోకి రావడంతో ఈ కేసు విషయమై పోలీసులు ఏ విధంగా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
ఇక ఈ కేసు విషయమై మరో ఆరోపణ వినిపిస్తోంది. రాజకీయ జోక్యం కారణంగా ఈ కేసు నీరుగారిపోతోందని తెలుస్తోంది. ఒక మేజర్, ఐదుగురు మైనర్లూ కలిసి చేసిన ఈ నేరాన్ని తీవ్ర స్థాయిలో ప్రతిఘటించి, నిందితులపై కఠిన శిక్షలు అమలు అయ్యే విధంగా చేయాల్సిన రాజకీయ నాయకులు తమ పెత్తనం మాత్రం పోలీసులపై బాగానే చేలాయిస్తున్నారు అన్న ఆరోపణలు ఉన్నాయి. పైకి చట్టం దృష్టిలో అంతా ఒక్కటే అని చెప్పి, లోపల మాత్రం చేయాల్సినదంతా చేస్తూనే ఉన్నారన్న విమర్శలకు ఆధారాలు అనేకం ఉన్నాయి.
ఇంత జరిగినా సిగ్గు రాలేదు,
ఆధారాలు చూపించిన రఘన్న @RaghunandanraoM పై కేసు,మైనర్ ని రేప్ చేసిన వాళ్ళకి జైలులో రాజభోగాలు,నిందితులు లేనోడైతే ఈ పాటికి ఎన్కౌంటర్ చేయించి జబ్బలు చరుసుకుందురు…
బంగారు తెలంగాణ,కాస్మోపాలిటన్ సిటీ🙄
అమ్మాయిలని కూడా పంపియ్యండి ఇగ. pic.twitter.com/EOE5jt0wkg— 🇮🇳Shiva Reddy Palle🇮🇳🚩 (@PSR4Bharat) June 12, 2022