టాలీవుడ్ స్టార్ నటితో నరేష్ నాలుగో పెళ్లి..?

-

కామెడీ రోల్స్ లో అద్భుతంగా నటించి.. మెప్పించే ప్రతిభ ఉన్న అతికొద్ది మంది నటుల్లో సీనియర్ నటుడు నరేష్ ఒకరని చెప్పవచ్చు. అయితే సీనియర్ నటుడు నరేష్ ప్రముఖ నటి పవిత్ర లోకేష్ పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. గతంలో వీరిద్దరు కలిసి చాలా సినిమాలలో నటించగా… వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని టాలీవుడ్లో చిత్ర పరిశ్రమలో వార్తలు వచ్చాయి.

అయితే తాజాగా వీరిద్దరూ మహాబలేశ్వరం వెళ్లి స్వామీజీని దర్శించుకున్నారు అనే వార్తలు కూడా తాజాగా తెరపైకి వచ్చాయి. దీంతో వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని… అందుకే మహాబలేశ్వరం వెళ్లి ఉంటారని టాలీవుడ్ లో వార్తలు గుప్పు మంటున్నాయి.

కాగా.. సీనియర్ నటుడు నరేష్ ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్న భార్యలతో మనస్పర్ధలు రావడం మరియు ఇతర కారణాల వల్ల తీసుకున్నారు. సీనియర్ నటుడు నరేష్ వయస్సు 62 సంవత్సరాలు కాగా పవిత్ర వయసు 53 సంవత్సరాలు. పవిత్ర లోకేష్ చాలా సంవత్సరాల క్రితం శాండల్వుడ్ కు చెందిన ప్రసాద్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. వారిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు. అయితే నరేష్ తో వివాహంపై… ఇద్దరిలో ఎవరో ఒకరు స్పందిస్తే తప్ప ఈ వార్తల్లో నిజం ఎంత ఉందో తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news