థంబ్ నైల్ చూసి, భయపడే నువ్వు.. వెంట్రుక పీకలేరంటూ బిల్డప్ ఎందుకు? – నారా లోకేష్

-

ఏపీ సిఎం జగన్ మోహన్ రెడ్డి పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫైర్ అయ్యారు. సీఎం జగనుకు మీడియాని చూస్తే భయం, సోషల్ మీడియా అంటే వణుకు అంటూ ఎద్దేవా చేశారు. చివరికి యూట్యూబ్ ఛానెల్ థంబ్ నైల్ చూసి జడుసుకునే జగన్ సింగిల్ గా వచ్చే సింహమా! వీధి కుక్క కూడా కాదని ఎద్దేవా చేశారు నారా లోకేష్.

ఈ మాదిరి పిరికోడికి నా వెంట్రుక పీకలేరంటూ పిల్లల ముందు బిల్డప్ ఎందుకు? అని ఫైర్ అయ్యారు. కనీసం ఐడెంటిటీ లేకుండా అర్ధరాత్రి దొంగల్లా గోడ దూకడం, గునపాలతో తలుపులు పగుల గొట్టిన కొంత మంది పోలీసులు వైసిపి గూండాలను మించిపోయారని అగ్రహించారు నారా లోకేష్.

గుంటూరు జిల్లా అమరావతి మండలం ధరణికోట గ్రామవాసి, టీడీపీ కార్యకర్త, యూట్యూబ్ ఛానెల్ నిర్వాహకుడు వెంకటేష్ ఇంట్లోకి చొరబడి దాడి చేసి అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని వెల్లడించారు. కనపడకుండా ఉండటానికి లైట్లు పగలగొట్టిన పోలీసుల మొఖాలన్నీ స్పష్టంగా వీడియోలో రికార్డయ్యాయి… జగన్ ప్రాపకం కోసం చట్టాన్ని అతిక్రమించి అడ్డదారులు తొక్కుతున్న వారంతా మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news