బీజేపీలో చేరి కనీసం వారం రోజులు కూడా కాలేదు…అప్పుడే టీఆర్ఎస్ పార్టీకి చుక్కలు చూపిస్తానని మాజీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి వార్నింగ్ ఇచ్చేశారు…ఇంతకాలం న్యూట్రల్ గా ఉన్న కొండా…తాజాగా ప్రధాని మోదీ సమక్షంలో బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. అలాగే చేరడం చేరడమే కొండాకు బీజేపీ కీలక పదవి ఇచ్చింది. ఈటల రాజేందర్ కన్వీనర్ గా ఉన్న చేరికల కమిటీలో సభ్యునిగా నియమించింది. ఇక తనకు కరెక్ట్ పొజిషన్ దక్కిందని, టీఆర్ఎస్ పార్టీ నుంచి నెలకొకరిని తీసుకొచ్చేస్తానని కొండా చెప్పుకొచ్చారు. పరోక్షంగా టీఆర్ఎస్ పార్టీకి వార్నింగ్ ఇచ్చేశారు.
ఆర్ధికంగా, సామాజికంగా బలంగా ఉన్న కొండాకు అన్నీ పార్టీల నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి…అలాగే వివాదరహితుడుగా ఉన్నారు. ఇక గతంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో పనిచేసిన అనుభవం ఉంది. ఆ రెండు పార్టీల నేతలతో టచ్ లో ఉన్నారు. అయితే కొండా ఫోకస్ అంతా టీఆర్ఎస్ పైనే ఉన్నట్లు ఉంది…ఆయనకు టీఆర్ఎస్ లోనే కాస్త అవమానాలు ఎక్కువ జరిగాయి.
2014లో కొండా టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి చేవెళ్ళ ఎంపీగా గెలిచిన విషయం తెలిసిందే..అయితే టీఆర్ఎస్ లో ఉండే కేటీఆర్ వర్గం..నిదానంగా కొండా పార్టీ వదిలి వెళ్లిపోయేలా చేశారు. దీంతో కొండా టీఆర్ఎస్ వదిలి కాంగ్రెస్ లోకి వచ్చారు…2019లో కాంగ్రెస్ తరుపున నిలబడి చేవెళ్ళ బరిలో స్వల్ప మెజారిటీ తేడాతో ఓడిపోయారు. కానీ తర్వాత రాజకీయాలకు కాస్త దూరం జరిగారు…తన స్నేహితుడు రేవంత్ రెడ్డి ఆహ్వానించిన సరే congress లోకి రాలేదు. టీఆర్ఎస్ పార్టీని ఓడించే సత్తా బీజేపీకే ఉందని, ఆ పార్టీలో చేరారు.
అయితే రేవంత్ స్నేహితుడు కావడంతో కొండా కాంగ్రెస్ పై ఫోకస్ చేసే అవకాశాలు తక్కువ..అందుకే ఆయన..తన మెయిన్ టార్గెట్ టీఆర్ఎస్ నుంచి నెలకొకరిని బయటకు లాగి బీజేపీలో చేర్చుతానని అంటున్నారు. అలాగే నెక్స్ట్ చేవెళ్ళ పార్లమెంట్ బరిలో కొండా దిగనున్నారు…ఈ సారి చేవెళ్లలో కొండాకు గెలుపు అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. మొత్తానికి చాలా రోజుల తర్వాత కొండా పోలిటికల్ ఫీల్డ్ లోకి దిగారు.