ఈ ఏడాది ప్రారంభం నుంచి తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంక పరిస్థితి రోజు రోజుకు మరింత అధ్వానంగా తయారవుతుంది. తాజాగా ఆ దేశ అధ్యక్షుడు రాజపక్సే దేశం విడిచి పారిపోయినట్లు గా వార్తలు వస్తున్నాయి. ఓ వైపు ప్రజలు నిత్యావసరాల కోసం పెనుగులాట, మరోవైపు ఇంధనాన్ని కొనుగోలు చేయలేక చేతులెత్తేసిన ప్రభుత్వంపై ప్రజల ఆగ్రహజ్వాల మిన్నంటింది. తినడానికి తిండి లేక లంక ప్రజలు అల్లాడిపోతున్నారు.
ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న లంక ప్రజలకు ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ కృతజ్ఞతలు తెలిపాడు.ఇంతటి ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి తినడానికి తిండి దొరకని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ లంక ప్రజలు తమపై ఎంతో ఆదరాభిమానాలు చూపించారని, వారి ప్రేమతో నన్ను కదిలించింది అని వార్నర్ పేర్కొన్నాడు. శ్రీలంక పర్యటనను సుఖాంతంగా ముగించుకొని ఆస్ట్రేలియా తిరుగు ప్రయాణమైన నేపథ్యంలో డేవిడ్ వార్నర్ తన ఇంస్టాగ్రామ్ వేదికగా ఈ లేఖను షేర్ చేశాడు.
David Warner shows his appreciation for Sri Lanka 🙌 #SLvAUS pic.twitter.com/mnrGI3luUd
— ESPNcricinfo (@ESPNcricinfo) July 11, 2022