రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం

-

రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. పార్లమెంట్ భవనంలో నేడు ఎన్నికల కౌటింగ్ షూరు అయింది. దేశానికి 15వ రాష్ట్రపతి ఎవరనే విషయం మరికొద్ది సేపట్లో తేలిపోనుంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ కోసం అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. పార్లమెంట్ హౌస్‌లోని 63వ నంబర్ గదిలో గురువారం ఉదయం 11 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియను ప్రారంభించారు. ఇప్పటికే అన్ని రాష్ట్రాల నుంచి బ్యాలెట్ బాక్సులు పార్లమెంట్ హౌస్‌కు చేరుకున్నాయి.

ద్రౌపది ముర్మ-యశ్వంత్ సిన్హా
ద్రౌపది ముర్మ-యశ్వంత్ సిన్హా

ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవికాలం మరో మూడు రోజుల్లో ముగియనుంది. నూతన రాష్ట్రపతిగా గెలుపొందని అభ్యర్థి ఈ నెల 25వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా, రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్‌డీఏ అభ్యర్థిగా ద్రౌపది ముర్ము, విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు యశ్వంత్ సిన్హా పోటీల్లో పాల్గొన్నారు. అయితే ఇప్పటికే దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు ద్రౌపది ముర్ముకే మద్దతు తెలిపారు. 60 శాతం వరకు ద్రౌపది ముర్ము గెలిచే అవకాశాలు ఉన్నాయని రాజకీయ పండితులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news