ఆర్బీఐ బ్యాంక్ పలు బ్యాంకులపై కొరడా విధించింది.గతంలో ఆర్బీఐ విధించిన నిభంధనలను ఉల్లంఘిస్తూ..బ్యాంక్ కార్యకలాపాలకు అంతరాయం కల్పిస్తున్న తాజాగా మరో నాలుగు కో-ఆపరేటివ్ బ్యాంకులపై ఆర్బీఐ ఆంక్షలు పెట్టింది. ఆర్బీఐ ఆంక్షలు విధించిన బ్యాంకులలో సాయిబాబా జనతా సహకారి బ్యాంకు, సూరి ఫ్రెండ్స్ యూనియన్ కో-ఆపరేటివ్ బ్యాంకు, సూరి(పశ్చిమ బెంగాల్), నేషనల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్, బహ్రైచ్లు ఉన్నాయి. అంతేకాక సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుపై కూడా ఆర్బీఐ చర్యలు తీసుకుంది.
ఈ బ్యాంకుల ఆర్థిక పరిస్థితి దిగజారిపోతుందనే కారణంతో ఆర్బీఐ ఈ పరిమితులు తీసుకొచ్చింది. ఈ బ్యాంకులలో డబ్బులు డిపాజిట్ చేసిన వారు కూడా పరిమితికి మించి విత్ డ్రా చేసుకోవడానికి వీలు లేదు. ఆర్బీఐ విధించిన పరిమితి ప్రకారం.. సాయిబాబా జనతా సహకారి బ్యాంకు నుంచి కస్టమర్లు రూ.20 వేలకు మించి విత్ డ్రా చేసుకోవడానికి మాత్రమే పరిమిషన్ ఇచ్చింది.అలాగే సూరి ఫ్రెండ్స్ యూనియన్ కో-ఆపరేటివ్ బ్యాంకు నుంచి రూ.50 వేలు మాత్రమే విత్ డ్రా చేసుకోవాలి. అంతకు మించి విత్ డ్రా చేసుకోవడానికి వీలు లేదు.
నేషనల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకుపై అయితే కేవలం ఒక్కో కస్టమర్ రూ.10 వేలు మాత్రమే విత్ డ్రా చేసుకునే అనుమతి ఇచ్చింది ఆర్బీఐ. ఈ విత్ డ్రాయల్ పరిమితిని ఆర్బీఐ అమల్లోకి తెస్తోన్న విషయాన్ని తన నోటిఫికేషన్లో పేర్కొంది. ఈ ఆంక్షలన్ని ఆరు నెలల వరకు అమల్లో ఉంటాయని ఆర్బీఐ తన నోటిఫికేషన్లో పేర్కొంది. సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుపై పెనాల్టీని కూడా విధించింది. ఫ్రాడ్ క్లాసిఫికేషన్లో ఉల్లంఘనలకు పాల్పడిందని దానిపై పెనాల్టీ విదిస్తున్నట్లు తెలిపింది..