తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కూరుస్తునా సంగతి తెలిసిందే. ముఖ్యంగా హైదరాబాద్, దాని చుట్టూ ఉన్న జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఇక వికారాబాద్, శంకర్‌పల్లి ప్రాంతాల నుంచి భారీగా వరద వస్తోంది. ఈ తరుణంలోనే గండిపేట డ్యాం 12 గేట్లు ఎత్తి మూసీలోకి నీటి విడుదల చేస్తున్నారు అధికారులు. నార్సింగి నుంచి అప్పా వెళ్లే రహదారి పూర్తిగా మూసివేసారు.
దీంతో మూసీలో వరద ఉధృతి పెరగడంతో.. మూసారాంబాగ్ – అంబర్‌పేట్ బ్రిడ్జిపై రాకపోకలు నిలిపివేశారు. మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసారు అధికారులు. ఇధి ఇలా ఉండగా భారీ వర్షాల నేపథ్యంలో వికారాబాద్ జిల్లాలోని విద్యాసంస్థలకు ఇవాళ సెలవు ప్రకటించారు కలెక్టర్. దీంతో ఇవాళ ఆ జిల్లాలో విద్యాసంస్థలు మూత పడనున్నాయి.
కాగా రాష్ట్రంలో ఇవాళ, రేపు మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతవరణ కేంద్రం వెల్లడించింది. రాజస్థాన్ నుంచి ఏపీ తీరంలోని బంగాళాఖాతం వరకూ 1500 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ద్రోణి ఏర్పడింది. మరోవైపు రాయలసీమ నుంచి తమిళనాడు మీదుగా శ్రీలంక సమీపంలోని కోమరీన్ ప్రాంతం వరకూ 900 మీటర్ల ఎత్తున గాలులతో మరో ద్రోణి ఏర్పడింది. వీటి ప్రభావంతో తెలంగాణలో అక్కడక్కడ విస్తారంగా వర్షాలు కురుస్తాయని ప్రకటించింది.