నిప్పులు క‌క్కుతున్న ఎండ‌లో చ‌ల్ల‌ని నీటిని ఉచితంగా అందిస్తున్న స‌ర్దార్జీ.. వైర‌ల్ వీడియో..!

-

ఢిల్లీలో ఆ స‌ర్దార్జీ త‌న స్కూటీపై నీటి క్యాన్ల‌ను పెట్టుకుని అంద‌రికీ ఉచితంగా చ‌ల్ల‌ని నీటిని అందిస్తున్నాడు. రోడ్డుపై వ‌చ్చి పోయే వారి దాహార్తిని తీరుస్తూ అంద‌రిచే భేష్ అనిపించుకుంటున్నాడు.

త‌న‌కు స్థోమ‌త ఉన్నా.. లేక‌పోయినా సరే.. స‌మాజంలో ఉన్న తోటి వారికి స‌హాయం చేసిన‌ప్పుడే ఎవ‌రైనా మాన‌వ‌త్వం ఉన్న మ‌నిషి అనిపించుకుంటారు. ఇత‌రుల‌కు ఆప‌ద‌లో స‌హాయం చేసేవారే గొప్ప వ్య‌క్తిత్వం ఉన్న మ‌నుషులు అవుతారు. ఎలాంటి క‌ష్టం ఎదురైనా స‌రే.. ఎదుటి వారికి స‌హాయం చేసే వారే ఇత‌రుల దృష్టిలో గొప్ప‌వార‌వుతారు. ఢిల్లీలో ఓ స‌ర్దార్జీ కూడా స‌రిగ్గా ఇలాగే అందరిచే భేష్ అనిపించుకుంటున్నాడు. ఇంత‌కీ అస‌లు విష‌యం ఏమిటంటే…

ప్ర‌స్తుతం ఎండ‌లు ఎలా దంచి కొడుతున్నాయో అంద‌రికీ తెలిసిందే. కాలు బ‌య‌ట పెట్టాలంటేనే జ‌నాలు భ‌య‌ప‌డుతున్నారు. ఇలాంటి స్థితిలో ఎండ‌లో బ‌య‌ట తిర‌గ‌డం అంటే సాహ‌సం చేయ‌డ‌మనే చెప్పాలి. అయితే ఇదేమీ ప‌ట్టించుకోకుండా ఢిల్లీలో ఆ స‌ర్దార్జీ మాత్రం త‌న స్కూటీపై నీటి క్యాన్ల‌ను పెట్టుకుని అంద‌రికీ ఉచితంగా చ‌ల్ల‌ని నీటిని అందిస్తున్నాడు. రోడ్డుపై వ‌చ్చి పోయే వారి దాహార్తిని తీరుస్తూ అంద‌రిచే భేష్ అనిపించుకుంటున్నాడు.

అలా ఆ స‌ర్దార్జీ ఢిల్లీ రోడ్ల‌పై ఉచితంగా నీటిని అందిస్తున్న‌ప్పుడు ఎవ‌రో ఆ దృశ్యాల‌ను కెమెరాలో బంధించి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌గా ఇప్పుడా దృశ్యాలు నెట్‌లో వైర‌ల్ అవుతున్నాయి. ఈ క్ర‌మంలో ఎండ‌లోనూ అంత‌టి సేవ చేస్తున్న ఆ స‌ర్దార్జీని చూసి అంద‌రూ ఆయ‌న సేవ‌ను అభినందిస్తున్నారు. ఎర్ర‌ని ఎండ‌ను సైతం లెక్క చేకుండా పాద‌చారులు, వాహ‌న‌దారులు, ప్ర‌యాణికుల‌కు నీటిని ఉచితంగా అందిస్తుండ‌డంతో అత‌ని సేవా త‌త్ప‌త‌ర‌త‌ను అంద‌రూ ప్ర‌శంసిస్తున్నారు. తోటి వారికి సేవ అంటే అలా చేయాల‌ని ఆయ‌న్ను అంద‌రూ ఆద‌ర్శంగా తీసుకోవాల‌ని నెటిజన్లు కొనియాడుతున్నారు. అవును మ‌రి, నిప్పులు క‌క్కే ఎండ‌లోనూ అలా ఇత‌రుల‌కు సేవ చేస్తున్నాడంటే.. నిజంగా ఆ స‌ర్దార్జీ సేవా నిర‌తిని మ‌న‌మంద‌రం మెచ్చుకోవాల్సిందే క‌దా..!

Read more RELATED
Recommended to you

Latest news