రేపు, ఎల్లుండి గోదావరి ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన.. షెడ్యూల్‌ ఇదే..

-

ఏపీలో భారీ వర్షాలకు గోదావరి ఉగ్రరూపం దాల్చింది. దీంతో గోదావరి పరివాహక ప్రాంతాలన్నీ నీటమునిగాయి. అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటిస్తున్నారు. అయితే తాజాగా.. పోలవరం విలీన మండలాల్లో చంద్రబాబు పర్యటించనున్నారు. ఆ పర్యటనకు సంబంధించిన షెడ్యూడ్‌ వివరాలు ఇలా.. గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో రేపు, ఎల్లుండి పర్యటించనున్న టీడీపీ అధినేత. రేపు ఉదయం 8 గంటలకు తన నివాసం నుంచి వరద ప్రాంతాల పర్యటనకు వెళ్లనున్న చంద్రబాబు. మొదటి రోజు వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో పర్యటిస్తారు.

Andhra Pradesh CID files FIR against former CM Chandrababu Naidu, others  for 'cheating, criminal conspiracy' | India News | Zee News

శివకాశీపురం, కుక్కునూరులలో చంద్రబాబు పర్యటన కొనసాగుతుంది. అనంతరం భద్రాద్రి జిల్లా బూర్గంపహాడ్ లో ముంపు ప్రాంతాలకు చంద్రబాబు వెళ్లనున్నారు. రెండో రోజు ఎటపాక, కూనవరం, విఆర్ పురం మండలాల్లో పర్యటించనున్నారు చంద్రబాబు. తోటపల్లి, కోతులగుట్ట, కూనవరం, రేఖపల్లి ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన సాగుతుంది. గురువారం రాత్రి భద్రాచలంలో చంద్రబాబు బస చేయనున్నారు. శుక్రవారం భద్రాద్రి రామయ్యను చంద్రబాబు దర్శించుకోనున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news