బాలీవుడ్ బ్యూటిఫుల్ హాట్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఊర్వశీ రౌటెలా గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈమె సినిమాలలో నటించడమే కాదు.. తన అందాల వయ్యారాలతో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది. ముఖ్యంగా గ్లామర్ ఫోటో షూట్లతో.. బికినీ దుస్తులతో సోషల్ మీడియాలో మంట పెట్టే ఈ ముద్దుగుమ్మ ఎంతో మంది అభిమానులను కూడా సొంతం చేసుకుంది. ఇకపోతే తాజాగా ది లెజెండ్ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ సినిమాలో హీరో ఎవరో కాదు ప్రముఖ వ్యాపారవేత్త తమిళనాడుకు చెందినటువంటి శరవణన్.. ఇండియా మొత్తంగా మారు మ్రోగుతూ సంచలనం సృష్టించిన సినిమాలలో ది లెజెండ్ సినిమా కూడా ఒకటి. ఆరంభంలోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ చిత్రం తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.
తమిళనాడు వ్యాపారవేత్త శరవణన్ హీరోగా.. జెడి అండ్ జెర్రీ ద్వయం లో తెరకెక్కిన ఈ సినిమాను శరవణ ప్రొడక్షన్స్ బ్యానర్ పై శరవణన్ స్వయంగా నిర్మించారు. ఇకపోతే ఈ సినిమాకు హరీష్ జయరాజ్ సంగీతం అందించగా.. విలన్ గా సుమన్ నటించారు. అంతేకాదు ఎంతోమంది ప్రముఖులు కీలకపాత్ర పోషించారు. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరొక ఆసక్తికరమైన విషయం బయటకు రావడం జరిగింది. సాధారణంగా ఒక్కో సినిమాకు రెండు కోట్ల రూపాయలు తీసుకునే ఊర్వశీ ఈ సినిమా కోసం ఏకంగా 20 కోట్ల రూపాయలను తీసుకుందని సమాచారం.
ఇకపోతే బాలీవుడ్ లో హాట్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న ఈమె అక్కడ అరకొర అవకాశాలతోనే కెరియర్ను వెల్లదీస్తోంది. ఇక పెద్ద హిట్ సినిమాలు ఏమీ లేక అందాలు ప్రదర్శిస్తూ హాట్ టాపిక్ గా మారింది. ఇకపోతే బాలీవుడ్ లో ఈమెకు పెద్దగా అవకాశాలు లేకపోవడం వల్ల తెలుగులో సంపత్ నంది దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ రోజ్ సినిమాలో కేవలం కోటి లోపల పారితోషకం ఇచ్చినట్లు సమాచారం. కానీ శరవణన్ మాత్రం ది లెజెండ్ సినిమాకు ఆమెకు 20 కోట్ల రూపాయలు ఇచ్చి ఆమె లైఫ్ ను సెటిల్ చేశారని చెప్పవచ్చు. ఇక ఊర్వశితోపాటు రాయ్ లక్ష్మి కూడా నటించింది. ఇక ఆమెకు కూడా ఎక్కువగా పారితోషకం ఇచ్చినట్లు సమాచారం. ఇకపోతే ఈ సినిమా కామెడీ పరంగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని పెట్టుబడి కంటే రెట్టింపు స్థాయిలో కలెక్షన్ రాబడినట్లు సమాచారం.